విశాఖ

కిడారి ఆశయాలను నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, అక్టోబర్ 14: దివంగత ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు అశయాలను నెరవేర్చందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానంలో మావోయిస్టుల చేతిలో ఇటీవల హత్యకు గురైన కిడారి సంతాప సభను ఆదివారం నిర్వహించారు. సంతాపసభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మావోయిస్టులు కాల్చి చంపిన కిడారి కుటుంభానికి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో ఇతోధికంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. గిరిజనుల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం తపన పడిన వ్యక్తి హత్యకు గురికావడం బాధాకరమని ఆయన అన్నారు. విశాఖ ఏజెన్సీలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ దిశ, దశ చూపేవారని, ఎంతటి జటిలమైన సమస్య ఎదురైనా అత్యంత సున్నితంగా పరిష్కరించే సునిశిత ఆలోచనలు కిడారి స్వంతమని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపైనా తనతో చర్చించేవారని ఆయన చెప్పారు. ఇద్దరు గిరిజన నేతల హత్యలతో పార్టీతో పాటు మన్యం దిక్కు కోల్పోయిందని ఆయన అన్నారు. మృతి చెందిన కిడారి వారసుడిగా ఆయన తనయుడు శ్రావణ్‌కుమార్‌ను ఆదరించి వారి కుటుంభానికి అండదండగా నిలవాలని ఈ ప్రాంత వాసులను ఆయన కోరారు. గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపేందుకు గాను వైసీపీ నుంచి ఎన్నికైన కిడారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ఆకర్షితులై దేశం పార్టీలో చేరినట్టు ఆయన చెప్పారు. నాయకులను హత్య చేసే హక్క మావోయిస్టులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు ఉన్న నాయకులను తుపాకులతో కాల్చి చంపడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ సంఘటనను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన కోరారు. తప్పులు చేసిన వారిని హెచ్చరించాలే తప్ప వారి ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతవరకు సముచితమో మావోయిస్టులు ఆలోచించాలని ఆనందబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే గండి బాజ్జి మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొట్యాట అప్పారావు, అరకులోయ, చీడికాడ జ్పెడీటీసీలు కూన వనజ, పి.సత్యవతి, ఎం.పి.పి.లు కె.అరుణకుమారి, పైడితల్లి, ఉమామహేశ్వరరావు, జి.సి.సి. ఎం.డి. టి.బాబురావునాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, పాడేరు ఎ.ఎస్.పి. అమిత్‌బర్ధార్, కిడారి కుటుంభ సభ్యులు గిడ్డి పరమేశ్వరి, కిడారి శ్రావణ్‌కుమార్, సందీప్‌కుమార్, కనుష్య, చిట్టిబాబు, తెలుగుదేశం నాయకులు శోభ హైమావతి దేవి, శెట్టి లక్ష్మణుడు, బాకూరు వెంకటరమణరాజు, శెట్టి బాబురావు, పొద్దు అమ్మన్న, పలువురు అధికారులు, ఉద్యోగులు, నాయకులు, నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేతలను హతమార్చే విధానాలను విడనాడాలి
* మావోయిస్టులకు కొణతాల సూచన
అరకులోయ, అక్టోబర్ 14: గిరిజనాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ రాజకీయంగా ఎదుగుతున్న నేతలను హతమార్చే విధానాలను మావోయిస్టులు మానుకోవాలని మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సూచించారు. స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన కిడారి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ మన్యంలో ఎదుగుతున్న నాయకులను హతమార్చుతున్న మావోయిస్టులు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నాయకులను హత్యలు చేసుకుంటూ పోతే ఈ ప్రాంతంలో రాజకీయ నేతలు కరువవుతారని ఆయన చెప్పారు. సమర్థమైన నాయకత్వం లోపిస్తే గిరిజనాభివృద్ధి ఏలా సాధ్యవౌతుందని ఆయన ప్రశ్నించారు. విశాఖ మన్యంలో గత కొంతకాలంగా మావోయిస్టులు ఎదుగుతున్న నేతలను హత్యలకు గురిచేస్తున్నారని, తాజాగా అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హతమార్చి ఈ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితిని కల్పించారని ఆయన చెప్పారు. నాయకుల హత్యలతో మావోయిస్టులు తమ సిద్ధాంతాలను ఏ రకంగా సాధించుకుంటారని ఆయన నిలదీసారు. ఈ ఇద్దరు నేతల హత్యలే కాకుండా గతంలో మాజీ మంత్రి మణికుమారి భర్త వెంకటరాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు, సమిడ రవిశంకర్, ఉగ్గరంగి సోమలింగం, హుకుంపేడ ఎం.పి.పి. కొర్రా చిట్టిబాబులను దారుణంగా హత్య చేయడం వలన వారి కుటుంభాలు వీధిన పడ్డాయని ఆయన అన్నారు. మావోయిస్టులు తమ విధానాలను మార్చుకుని నాయకుల పట్ల నిరంకుశత్వాన్ని విడనాడాలని ఆయన కోరారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య వెనుక రాజకీయ విధేదాలు దాగి ఉన్నట్టు తెలుస్తుందని, పథకం ప్రకారమే వీరిని హత్య చేసారని ఆయన చెప్పారు. గతంలో వెంకటరాజును కూడా ఇదే తరహాలో పథకం ప్రకారమే మట్టుబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే కిడారి, సోమల హత్యలకు గల కారణాలను ప్రభుత్వం వెలికితీసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రామక్రిష్ణ కోరారు.

నూకాంబిక ఆలయంలో వైభవంగా కలశ పూజ
అనకాపల్లి, అక్టోబర్ 14: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సరస్వతీ దేవి అవతారంలో దుర్గాదేవిని అలంకరించారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని అనూహ్య సంఖ్యలో భక్తులు దర్సించుకున్నారు. మూలానక్షత్ర పర్వదినం సందర్భంగా నూకాంబిక ఆలయంలో కలశ పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దంపతులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇవో సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఇవో సుజాత, అభివృద్ధి కమిటీ సభ్యులు కొణతాల వెంకట్రావు, మళ్ల సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నవంబర్ 5నుండి నిరవధిక సమ్మెకు
పీఎసిఎస్ ఉద్యోగులు
అనకాపల్లి, అక్టోబర్ 14: అపరిష్క్రత సమస్యల పరిష్కారం కోరుతూ పీఎసిఎస్ ఉద్యోగులు వచ్చేనెల 5నుండి నిరవదిక సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర పీఎసిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పివి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ ఉద్యోగులు న్యాయసమ్మతమైన ఈ సమ్మెకు అన్నివర్గాల వారు మద్ధతునివ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక సీఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా పీఎసిఎస్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ గ్రామస్థాయిలో రైతులకు కావాల్సిన పరపతేతర వ్యవసాయ అవసరాలు, నిత్యావసర వస్తువులు అందిస్తున్న పీఎసిఎస్ సిబ్బందికి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేసారు. పీఎసిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 2008 పీఎసిఎస్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవదిక సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. నాగభూషణం మాట్లాడుతూ పీఎసిఎస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని డిసిసిబి ఉద్యోగులుగా గుర్తించి ప్రతీనెలా విధిగా జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగుల నివరదిక సమ్మె వలన జిల్లాలోని 98 పీఎసిఎస్‌లు మూతపడతాయని రైతులు తమ అవసరాలు తీరక ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. నవంబర్ 5న నిరవదిక సమ్మె, 12న డిసిసిబి వద్ద ధర్నా, 19న డిసివో కార్యాలయం వద్ద ధర్నా, 26న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, డిసెంబర్ 3న విజయవాడలో రిలే నిరాహార దీక్ష, డిసెంబర్ 12న ఛలో విజయవాడ తదితర రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలను ఉద్ధృతం చేయనున్నట్లు రాష్ట్ర యూనియన్ కోశాధికారి తోట వెంకటరామయ్య తెలిపారు. యూనియన్‌జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శివరామకృష్ణ, సీఐటియు నాయకులు సత్యనారాయణ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మళ్ల స్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హెపటైటిస్ బి వ్యాక్సిన్‌తో కాలేయాన్ని కాపాడుకోవాలి
అనకాపల్లి, అక్టోబర్ 14: హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరూ విధిగా వేసుకోవడం ద్వారా కాలేయాన్ని ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారి బారినుండి కాపాడుకోవచ్చునని వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ డిడి నాయుడు అన్నారు. స్థానిక వేంకటేశ్వర నర్సింగ్ హోమ్‌లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆదివారం డాక్టర్ నాయుడు ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ వరుసగా మూడునెలలు హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను వేసుకోవడం ద్వారా కామెర్ల వ్యాది దరిచేరకుండా కాపాడుకోవచ్చునన్నారు. హెపటైటిస్ అనే వైరస్ దరిచేరకుండా ఈ వ్యాక్సిన్ కాపాడుతుందన్నారు. ఒకరి సూదులు మరొకరికి వాడటం, పచ్చబొట్లు, రక్తదానం, వాపరాయి స్ర్తిలను కలవడం తదితర చర్యల వలన హెపటైటిస్ బి వైరస్ సోకుతుందన్నారు. దీనివలన లివర్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాలు ప్రబలుతాయన్నారు. ప్రముఖ స్ర్తి వ్యాధి నిపుణులు డి. హారికా, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.