విశాఖపట్నం

చంద్రబాబుగారూ! అబద్ధాలు ఆడకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమిబ్యూరో, విశాఖపట్నం
చంద్రబాబు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని చాలా మందికి తెలియదు. వీరిద్దరూ ఒకే కళాశాల్లో చదివారు. బాబు కన్నా ఎస్పీ సీనియర్ అనుకోండి! శనివారం స్థానిక ఆర్‌కె బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవ్ వేదిక మీద వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి జనం నివ్వెరపోయారు. గతంలో వీరిద్దరూ ఎక్కడా పెద్దగా కలిసిన దాఖలాలు లేవు. కానీ విశాఖ వేదిక మీద చంద్రబాబుపై బాలు విసిరిన చమత్కారాలు ప్రేక్షకులను భలే ఆకట్టుకున్నాయి. వేదిక మీదకు వీరిద్దరూ రాగానే పక్కపక్కనే కూర్చుని స్వవిషయాలు మాట్లాడుకున్నారు. పనుల వత్తిడిలో పడి, తను తన మనవడితో గడపలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు ఎస్పీ వద్ద వాపోయారు. కనీసం వారంతంలో కూడా కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. మరికొన్ని క్షణాల్లోనే చంద్రబాబు నాయుడు జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వీకెండ్స్ హ్యాపీగా గడపాలంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...‘చంద్రబాబు నాయుడుగారూ మీరు అబద్ధాలు ఆడకండి! ఇప్పుడే మీరు నాతో మాట్లాడుతూ కనీసం మనవడితో గడపలేకపోతున్నానని చెప్పారు. మీరేమో జనాన్ని వీకెండ్స్ ఎంజాయ్ చేయమంటున్నారు. మీరు హాయిగా గడపకుండా, జనాన్ని హాయిగా ఉండమని అంటున్నారు. మీరు ముందు కుటుంబ సభ్యులతో గడపండి. నేను నా జీవితంలో నా పిల్లలతో గడపలేదు. ఇప్పుడు మనుమలతో కాలక్షేపం చేస్తున్నాను. మీరు కూడా మారండి.’ అని అన్నారు.

ఉత్సవ వేళ..అలకల గోల!
*ప్రజా ప్రతినిధులకు ఆహ్వానపత్రాలు అందని వైనం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 2: గతంలో ప్రజా ప్రతినిధులకు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలకు అధికారులు గౌరవమర్యాదలు ఇచ్చేవారు. కానీ ఈసారి ఆ కార్యక్రమాన్ని అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులను చాలా దారుణంగా పరిగణిస్తున్నారు. విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిరంతరం శ్రమించారు. కానీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపిలకు ఎవ్వరికీ అధికారులు స్వయంగా ఆహ్వాన పత్రాలు అందించలేదు. కొంతమందికి ఇళ్ళకు పోస్ట్‌లో పంపించారు. చాలా మంది ఎమ్మెల్యేలకు జిల్లాపరిషత్ సమావేశంలో వారువారు కూర్చున్న స్థానాల్లో ఆహ్వానపత్రాలను పడేశారు. ఆహ్వానపత్రాలపై ఆయా ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా లేకపోవడం గమనార్హం. కనీసం ఆ ఆహ్వానపత్రాలు అక్కడికి ఎవరు తీసుకువచ్చారో కూడా ఎమ్మెల్యేలకు తెలియకపోవడం గమనార్హం. అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎంపిలు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముగ్గురు ఎమ్మెల్యేలు విశాఖ ఉత్సవ్ కార్యక్రమాలకు హాజరు కాలేదు. శనివారం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికి వీరంతా వారి వారి నియోజకవర్గాలకు వెళ్లిపోయారు.