విశాఖపట్నం

జీవీఎంసీ గ్రీవెన్స్‌కు 117 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 12: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో మొత్తం 117 ఫిర్యాదులుందాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు. అందిన మొత్తం 117 ఫిర్యాదుల్లో ప్రధాన కార్యాలయానికి సంబంధించి 23 ఫిర్యాదులందాయి. ఒకటోవ జోన్‌కు సంబంధించి ఏడు, నాల్గొవ జోన్‌కు సంబంధించి ఆరు, ఐదవ జోన్‌కు సంబంధించి 67, అరవ జోన్‌కు సంబంధించి పది, అనకాపల్లి జోన్‌కు సంబంధించి రెండు, భీమిలి జోన్‌కు రెండు ఫిర్యాదులందాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్ విభాగంకు సంబంధించి 19, ప్రజారోగ్యవిభాగానికి ఏడు, ఇంజనీరింగ్ విభాగానికి 47, యుసిడి విభాగానికి ఏడు, హర్టికల్చర్‌కు మూడు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ విభాగంకు 16, ఇతరులకు సంబంధించి 18 ఫిర్యాదులందాయి.
* డయల్ యువర్ కమిషనర్‌కు 10 ఫిర్యాదులు
జీవీ ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి పది ఫిర్యాదులందాయి. డిపివో బివి రమణ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి హాజరై పలువురి నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సమాధానం చెప్పారు. ఇందులో ఒకటోవ జోన్‌కు సంబంధించి రెండు, రెండో జోన్‌కు ఒకటి, నాల్గొవ జోన్‌కు ఒకటి, ఐదవ జోన్‌కు ఒకటి, ఆరవ జోన్‌కు ఐదు ఫిర్యాదులందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి మూడు రోజులుగా నివేదిక కమిషనర్‌కు సమర్పించాలన్నారు.

సర్వశిక్షాభియాన్ పీవోగా సన్యాసిరావు
జగదాంబ, నవంబర్ 12: జిల్లా సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారిగా డాక్టర్ బి.విశ్వనాథ సన్యాసిరావు నియమితులయ్యారు. ఏడాది పాటు డిప్యూటీషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సన్యాసిరావు గుంటురు జిల్లా జైల్ సూపరిండింటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అలాగే ఈ పోస్టుకు దాదాపు ఎనిమిది నెలలుగా జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-----
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం
* ఏపీ వెలుగు యూనిమేటర్ల ఉద్యోగుల సంఘం డిమాండ్
జగదాంబ, నవంబర్ 12: వెలుగు పథకంలో పనిచేస్తున్న విలేజ్ యానిమేటర్లుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని ఏపీ వెలుగు యూనిమేటర్ల సంఘం నాయకులు లోకనాథం అన్నారు. ఏపీ వెలుగు వివో ఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీటూ కార్యాలయం నుంచి జీవీ ఎంసీ గాంథీ విగ్రహాం వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహాం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల నిర్వహాణలో కీలకప్రాత పోషిస్తున్న యూనిమేటర్లులకు ఐదు వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మూడు వేలు మాత్రమే పారితోషికంగా ఇచ్చిన జీవో నెంబర్ 1243ను సవరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవోను మార్పు చేయాలని కార్మికులంతా నినాదాలు చేశారు. సంఘం జిల్లా నాయకురాలు రుపాదేవి మాట్లాడుతూ మూడువేలను కూడా సర్వీస్ చార్జీ కింద ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కోడం సరికాదున్నారు. తెలంగాణ మాదిరిగానే ఆరువేల రూపాయాలు వేతనాలు చెల్లిస్తామని, వీటితో పాటు పదోన్నతులు, ప్రమాధబీమా, గుర్తింపుకార్డులు, యూనిపామ్‌లను అందించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ పెండింగ్ డిమాండ్లును పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దాకారపు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.