విశాఖ

విలీన గ్రామాల అభివృద్దికి కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, నవంబర్ 15: జీవీఎంసీ జోన్ పరిధిలో ఉన్న విలీన గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకుంటామని జివిఎంసి జోనల్ కమీషనర్ బి రాము అన్నారు.జివిఎంసి విలీన గ్రామమైన కొప్పాకలో గురువారం నగర దర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమృతం పథకం ద్వారా ప్రతీ ఇంటికీ తాగునీటి కొలాయిను ఉచితంగాఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి అభివృద్ది కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కృషి మేరకు విశాఖ జివిఎంసి నుండి ఎక్కుల నిధులు మంజూరు చేయించి విశాఖకు దీటుగా దశలవారిగా అనేక అభివృద్ది పనులు చేయడానికి సిద్దంగా ఎమ్మెల్యే పీలా ఉన్నారన్నారు.ఈ సందర్బంగా స్థానిక నాయుకులు వానపల్లి బాబూరావు, మిత్తపాటి గోపాలరావు, బి మొరళీగిరిలు ఇక్కడి సమస్యలు వివరించారు. సుమారు 13 గ్రామలకు ఏఎన్‌ఎం సెంటర్‌ను మెరుగుపర్చాలని, శిధిలావ్యవస్థకు చేరుకున్న పశువైద్యశాలను నిర్మించాలని, శుభ కార్యాయాలు చేసుకోవడానికి కల్యాణ మండపం నిర్మించాలని, సిసిరోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు నిర్మించాలని కోరారు.దీనిపై స్పందించిన జెడ్సీ రాము మాట్లాడుతూ మీకు కావలసిన అభివృద్ది పనులుపై ధరఖాస్తు అందజేసినట్లు అయితే నేరుగా సిఎం డేస్‌బోర్డుకు చేరుతుందని తక్షణం వాటిపై దృషి సారిస్తారన్నారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్బంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసారు. ఈ కార్యక్రమంలోఅన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి శ్రావణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే పీలా అభినందన
అనకాపల్లి టౌన్, నవంబర్ 15:నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గిరిజన, వైద్య శాఖామంత్రి కిడారి శ్రావణ్ విశాఖ తొలిసారిగా విచ్చేసిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గురువారం కలిసి అభివందన తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి శ్రావణ్‌ను అనకాపల్లి విచ్చేసి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. జిల్లాదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర దేశం నాయుకులు పాల్గొన్నారు.
జివిఎంసి పాఠశాలల్లోపారిశుద్ధ్యం కార్మికులను పనుల్లోకి తీసుకోవాలి
అనకాపల్లి టౌన్, నవంబర్ 15: జివిఎంసి జోన్‌లోగల పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న 24మందిని వెంటనే పనుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిపిఎం, సిఐటియుసి అధ్వర్యంలో మహిళా కార్మికులు గురువారం అర్డీవో సూర్యకళకు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ నాయుకులు ఎ బాలకృష్ణ, సిఐటియు నాయుకులు మళ్ళ సత్యనారాయణలు మాట్లాడుతూ జివిఎంసి పాఠశాలల్లో గత నాలుగు సంత్సరాలునుండి 24మంది పనిచేస్తున్నారని వారికి నెలకు కేవలం రెండువేలు రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. వారికి 9నెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు. ఇప్పుడు నవంబర్ నెల నుండి వారిని పనులునుండి తొలగించారన్నారు. పాఠశాలల్లో మహిళా కార్మికులు పారిశుద్ద్య పనులు నిర్వహిస్తూ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేందుకు కృషిన వారిని తొలగించడం అన్యామన్నారు.కార్మికులకు చెల్లించవలసిన బకాయులు చెల్లించి మహిళా కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. వై ఏసురాజు, బి రాము, రూపావతి, లక్ష్మి, మణి, దుర్గ్భావాని, శ్రావణి, కొండమ్మతదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన
సబ్బవరం, నవంబర్ 15 : 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక శాఖాగ్రంథాలయంలో పాఠకులకు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈమేరకు స్థానిక గ్రంథాలయ అధికారి పివి రమణ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలతోపాటు చిన్నపిల్లల కథల పుస్తకాలు చందమామ,బాలమిత్ర లాంటి వాటితోపాటు యువత,విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో పాఠకులు ఎస్.్భస్కరరావు,పైడిరాజు శంకర్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.