విశాఖ

హతురాలి కుటుంబానికి నాలుగులక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, నవంబర్ 15: ఈనెల దీపావళి పర్వదినం ముందురోజు కొంతమంది ఆకతాయిల చేతిలో హత్యకు గురైన స్థానిక కోటవీధికి చెందిన పిల్లల పద్మావతి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. చోడవరం విచ్చేసిన ముఖ్యమంత్రిని హతురాలి తండ్రి ఈశ్వరరావు, లక్ష్మీ దంపతులు హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి తమగోడు వెళ్లబోసుకోగా స్థానిక ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ ముఖ్యమంత్రికి జరిగిన సంఘటనను వివరించారు. అక్కడికక్కడే ఆయన స్పందించి నాలుగు లక్షల రూపాయలను సహాయంగా అందజేసారు. ఈ సందర్భంగా హతురాలి పద్మావతి తల్లిదండ్రులు ఎమ్మెల్యే రాజుకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయులకు కృతజ్ఞతలు తెలియజేసారు. అధైర్యం చెందవద్దని అన్నివిధాలా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

సీఎం సమక్షంలో దేశం తీర్ధం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు
చోడవరం, నవంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజాసంక్షేమ విధానాల పట్ల ఆకర్షితులైన పలువురు సీఎం సమక్షంలో దేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గూనూరు అచ్చిబాబు, లక్ష్మీపురానికి చెందిన మాజీ వార్డుమెంబర్లు చిటికెల గోవింద, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి తదితర ఎనిమిది మంది సీఎం సమక్షంలో దేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ
చోడవరం, నవంబర్ 15: బాబూజగజ్జీవనరామ్ సుజలస్రవంతి పథకం శంకుస్థాపన పూజకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా గోవాడ సుగర్స్ సభ్యరైతులకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపించాలని, రైతులకు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విశాఖజిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ భారతకమ్యునిస్టు పార్టీ జిల్లా సంఘ సభ్యులు రెడ్డిపల్లి అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నాయకుడు ఎస్‌వినాయుడు, వేచలపువెంకటరమణ, మాడుగుల సీపీఐ నాయకులు ఎన్. నర్సింగరావు తదితరులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే తోటకూరపాలెం రైతులు తమప్రాంతాన్ని సుజల స్రవంతి పథకం ప్రాజెక్టులో తమ గ్రామాన్ని చేర్చవద్దంటూ ఆ గ్రామానికి చెందిన రైతులు ఆర్‌వైఎస్ నాయుడు, పైలా సన్నిబాబు, రుత్తల దాలినాయుడు, చింటి అచ్చిబాబు, ఎంపీటీసీ పైలా సూరిబాబు తదితరులు ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, శ్రావణ్‌కుమార్, ఉమామహేశ్వరరావులకు మొరపెట్టుకున్నారు. అలాగే జిల్లాలోని ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్‌వో ఆధ్వర్యంలోని సంఘ అధ్యక్షులు ఎన్.్భస్కర్, ఉపాద్యక్షులు ఎం.శంకర్‌లు వినతిపత్రం సమర్పించేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్టుచేసి బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.