విశాఖ

తోటకూరపాలెంలో పోలీస్ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం,నవంబర్ 15: సుజల స్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి తోటకూరపాలెం గ్రామస్తులు వెళ్ళకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసారు. చోడవరంలో గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన కార్యక్రమంలో తోటకూరపాలెం గ్రామస్తులు నల్లబ్యాడ్జీలతో పాటు ఫ్లకార్డులతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈప్రాజెక్టు నిర్మాణంలో గ్రామం మొత్తం తరలించాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులు తెలియజేయడంతో గతంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో తాత్కాలికంగా నిలిచిన పనులు తిరిగి గురువారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారన్న ప్రకటనతో గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమయ్యారని పోలీసులకు తెలిసింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈనేపధ్యంలో ప్రజలను సమావేశాలకు వెళ్ళకుండా నిలువరించడం ప్రజాస్వామ్య విరుద్దమని ఆరోపణలు వెల్లువెత్తడంతో గ్రామానికి చెందిన టీడీపీ, వైకాపా నుంచి 12 మంది ప్రతినిధులను ఎంపిక చేసి వీరిని పోలీసులే స్వయంగా ముఖ్యమంత్రి సమావేశానికి తీసుకువెళ్ళారు.

ప్రజా సమస్యల పరిష్కారమే గ్రామదర్శిని ధ్యేయం
కోటవురట్ల, నవంబర్ 15: ప్రజా సమస్యల పరిష్కారమే గ్రామదర్శిని ధ్యేయమని ఎంపీడీ ఓ సువర్ణరాజు అన్నారు. గురువారం మండలంలోని కొమిర గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు . ముందుగా అంగన్‌వాడీ, రేషన్ డిపో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ప్రజల నుండి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీ ఓ సువర్ణరాజు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు, జ్వరాల ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ అంబేద్కర్, ఇరిగేషన్ ఎ ఇ రామన్నపాత్రుడు, వెలుగు ఎపీ ఎం రమణకుమారి, వ్యవసాయాదికారి మధుసూధనరావు, ఆర్.డబ్ల్యు ఎస్ జె ఇ. శ్రీనివాస్, ఇ ఓపీ ఆర్‌డీ త్రిమూర్తులు, పశువైద్యాధికారిణి అశ్విని, ఐసీడీ ఎస్ సూపర్‌వైజర్ సత్యవతితో పాటు మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలకు ఏఎంఎఎ కళాశాల విద్యార్ధులు ఎంపిక
అనకాపల్లిటౌన్, నవంబర్ 15: హైదరాబాదులో ఈనెల 17నుండి 20వరకు జరగనున్న రాష్టస్థ్రాయి ఈనాడు ఖోఖో పోటీలకు ఏఎంఎఎ కళాశాల విద్యార్ధులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి జయబాబు తెలిపారు. ఈనెల 14న విశాఖలో జరిగిన పోటీల్లో ఈ కళాశాల విద్యార్ధులు ప్రధమస్థానాన్ని కైసవం చేసుకున్నారు. ఈ సందర్బంగా గురువారం కళాశాల అవరణలో ప్రిన్సిపల్ జయబాబు, యాజమాన్యం అధ్వర్యంలో క్రీడాకారులను అభినందించారు. అనంతరం జయబాబు మాట్లాడుతూ విద్యాతోపాటు క్రీడల్లోకూడా రాణించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కెఎస్‌ఎన్ మంగరాజు, కరస్పాడెంట్ డి శ్రీనివాసరావు, వాడిరెడ్డి బాలకృష్ణ, బి శివ, పి రామలింగం, కళాశాల సూపరిడెండెంట్ పి అనూరాధ, ఫిజికల్ డైరెక్టర్స్ కెవిఎస్ నాయుడు, వై నాయుడు, కోచ్ ఎ నూకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.