విశాఖపట్నం

టీడీపీతోనే కాపుల అభ్యున్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 15: కాపుల అభ్యున్నతి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కాపు కార్పోరేషన్ చైర్మెన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. గురువారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. కార్పోరేషన్ ద్వారా కాపులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. బడుగు,బలహీన వర్గాల కాపుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఆయన అన్నారు. కాపుల ఉన్నతి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం 3 వేల 100 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆయన అన్నారు. కాపు విద్యార్థుల విదేశీ చదువుల కోసం పది లక్షల రూపాయలను సబ్సిడీ పై అందించడం జరుగుతోందని దీనితో పాటు విమాన, వీసా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించి విద్యార్థులను అత్యున్నత స్థాయిలో నిలుపుతోందని ఆయన చెప్పారు. విద్యోన్నతి పధకంలో భాగంగా గ్రూప్స్, ఐఎఎస్,ఐపీఎస్‌లలో విజయం సాధించేందుకు దేశంలోనే అత్యున్న శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు కోచింగ్ ఇప్పించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. స్వయం ఉపాది పధకాలలో భాగంగా చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకోవడంతో పాటు కారులకు సబ్సిడీలతో రుణాలు మంజూరు చేస్తున్నామని ఆయన తెలియజేసారు. భవిష్యత్తులో కాపులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపకల్పణ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అంతకు ముందు ఆయన స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అధికారులు ఈయనకి ఆలయ మర్యాదలు చేసి ప్రసాదాలు అందించారు.

ప్రభుత్వ బాలికల గృహంలో వైద్య శిబిరం
సింహాచలం, నవంబర్ 15: బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా నగరంలోని ప్రభుత్వ బాలికల గృహంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించినట్లు గృహం పర్యవేక్షణాధికారి ఏవీ.సునీత నేడొక ప్రకటనలో తెలియజేసారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన వైద్యులు డాక్టర్ జీ. ఇందిరాప్రియదర్శినీ బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేసారు.దంత వైద్య నిపుణుడు డాక్టర్ డీఎస్‌ఎస్.వినయ్‌కుమార్ బాలికలకు దంత పరీక్షలు నిర్వహించి దంతాలకు వచ్చే వ్యాధుల పై అవగహన కల్పించారు. పరిశుభ్రత పై బాలికలకు వైద్యులు సూచనలు చేసారు. ప్రభుత్వ బాలికల గృహం వైద్యులు డాక్టర్ ఎన్ ఎస్ అమ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.