విశాఖపట్నం

నేటి నుండి బాలల సాహితీ ప్రపంచ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 16: విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ రెండురోజులపాటు హవామహల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సంస్థ హెడ్ సంధ్యాగూడే తెలిపారు. విఐపీ రోడ్డులో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడు కేటగిరీలుగా బాలల్ని విభజించి (4 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ మధ్య) 58 సెషన్స్ నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ, చెన్నై, తదితర ప్రాంతాల నుంచి 12 వేల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. చిన్నారులు రాసిన కథలను పుస్తకం రూపొందించి విడుదల చేస్తామన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో సౌతాప్రికా విద్యావేత్త స్టోరీ టెల్లర్ బోగిస్వ కొట్టురాముష్పాన, టపోబ్రాతిదాస్ సోనాల్ సర్ధా, ప్రియ ఉప్పలపాటి, సునీత నెనాటియా (పేజెస్) పాల్గొన్నారు.

అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ
విశాఖపట్నం, నవంబర్ 16: అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం, విశాఖ శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన ఛారిటబుల్ ట్రస్టీ సంయుక్త ఆధ్వర్యంలో కైలాసపురంలోని షిర్డీసాయి ఆలయంలో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ శుక్రవారం నుండి ప్రారంభించారు. సిఎంఆర్ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేవారాధానతో అన్నప్రసాద వితరణకు ప్రాధాన్యత ఉందన్నారు. గత 11 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న అధ్యక్ష, కార్యదర్శులు ఆదాల వేణుగోపాలరెడ్డి, జి.వసంతరావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆథ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్ మాలధారులు పాల్గొన్నారు.

వార్డు స్థాయి నుంచి మైక్రో ప్లాన్ రూపొందించండి

జగదాంబ, నవంబర్ 16: జీవీ ఎంసీ పరిధిలోని వార్డు,జోనల్ స్థాయి మైక్రోప్లాన్స్‌ను రూపొందించాలని అదనపు కమిషనర్ జీవీవీ ఎస్ మూర్తి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2019 నిబంధనల అమలుపై శుక్రవారం ఆయన జీవీ ఎంసీ పాత సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లుతో సమావేశాలు నిర్వహించి చైతన్యవంతం చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా అపార్ట్‌మెంట్ వాసులు వారి వివరాలను రిజిస్టర్ చేసుకునేలా చూడాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. అన్ని కమిర్షియల్ కాంప్లెక్స్‌ల్లో డస్ట్‌బిన్లు ఉండేలా చూడాలని, ప్రజారోగ్యానికి, స్వచ్ఛ నిబంధలు పాటించని వారికి జరిమానా విధించాలని కోరారు. అదే విధంగా రెండు, మూడు,నాల్గొ జోన్‌ల్లో దశల వారీగా బిన్‌ప్రీ అమలు చేయాలని, 2019 స్వచ్ఛసర్వేక్షన్ నిబంధనలు అమలు చేయడం ద్వారా స్వచ్చ విశాఖ సాధన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజారోగ్య విభాగంలోని అధికారులంతా ప్రజలను,స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా ఉత్తమ ర్యాంక్ సాధనకు చోరవ చూపాలన్నారు. అదే విధంగా బహిరంగ మలవిసర్జన లేకుండా చూడడం ద్వారా ఉత్తమ ర్యాంక్ సాధించాలన్నారు. అలాగే నగరంలో స్వచ్చత విషయంలో ఐదు నుంచి పది నిమిషాల నడవితో లఘుచిత్రాలను రూపొందించి వాటి ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. ప్రథమ బహుమతికి రూ.50వేలు, ద్వితీయ బహుమతికి రూ.25వేలు, తృతీయ బహుమతికి రూ.15వేలు అందజేస్తారన్నారు. అదే విధంగా ఉత్తమ సందేశాత్మాక లఘు చిత్రాలకు ప్రోత్సాహక బహుమతులను అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేమంత్, యుసీడీ పీడీ శ్రీనివాసన్, సీపీ సురేష్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.