విశాఖపట్నం

విద్యార్థుల చెంతకు ప్రపంచ విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: విద్యార్థుల చెంతకు ప్రపంచ విజ్ఞానం చేరనుంది. మానసిక, ఆరోగ్యపరమైన అంశాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని అతి సులభంగా పొందగలిగే అద్భుతమైన శాస్త్ర, సాంకేతికతను అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే సరికొత్త ఆలోచనలతో కూడిన విద్యా విధానం, సాంకేతికతతో కూడిన విజ్ఞానం పాఠశాల విద్యార్ధి స్థాయి నుంచి కొన్ని సంస్థలు చేరువ చేస్తుండగా, చివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోను అడుగు పెట్టాయి. ఓ ఉద్యమంలా తీసుకుని ప్రస్తుతం విద్యా విధాన పరిస్థితులనుకనుగుణంగా సులభమైనరీతిలో విద్యను అందిస్తున్నాయి. గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా సాంఘిక సంక్షేమం, కొలాబరేషన్, ప్రాడక్టవిటీ అంశాలను పటిష్టంగా అమలు చేస్తుండగా ఇందులో సాంఘిక సంక్షేమ పరిధిలోకి విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలకు ఈ సంస్థలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అలాగే నిర్మాణ కేటగిరి కింద ఎంప్లారుూమెంట్, ఎన్విరాన్‌మెంటల్ సస్టయిన్‌బిలిటీ, గ్లోబల్ పార్టనర్‌షిప్ అంశాలుంటాయి. ఇక ప్రొడక్టవీటికి సంబంధించి ట్రాన్స్‌పెరెన్సీ, ఈక్వాల్టీ, క్వాలటీ ఆఫ్ లివింగ్ అంశాలకు సంబందించి పలు స్టాళ్ళ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది.
* సరికొత్త ఆలోచనలతో విద్యార్థుల సమస్యల పరిష్కారం
విద్యాపరంగా విద్యార్థులు నిత్యం ఎదుర్కొనే కఠినతరమైన సమస్యల పరిష్కారానికి బీబాక్స్ సరికొత్త ఆలోచనలను ఆవిష్కృతం చేసింది. ప్రత్యేక యాప్ ద్వారా పాఠశాల తరగతి గదుల్లోనే సరికొత్త ఆలోచనలకు చెందిన అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. ప్రభుత్వ నిధుల సహకారంతో రూపొందించిన ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా సరికొత్త ఆలోచనలను విద్యార్థుల ముందుకు తీసుకువెళ్తున్నాం. ఐదు రూపాయల నాణెం ఉపయోగం ద్వారా ప్రసాదం తీసుకుని ఇవ్వడం, కంటిలో నీళ్ళు తుడుచుకోవడం వంటివి, సులభరీతిలో విద్యాబోధన వంటివి తాము దేశంలో పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అందిస్తున్నాం. 3టీచ్ ఫర్ ఇండియా2 పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. బెంగుళూరు కేంద్రంగా దేశం మొత్తం మీద ఆన్‌లైన్ సహకారంతో ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసుకుని మరీ సరికొత్త ఆలోచనలను విద్యార్థులకు అందించగలిగాం. ఈ విధంగా దేశంలో ఏపీ, తెలంగాణాతోపాటు కేరళ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో నిర్వహించాం. 120 మంది ఇంజనీర్లు బృందాలుగా ఏర్పడ్డాం. మూడవ తరగతి నుంచి ఇంజనీర్ విద్యార్ధి వరకు పలు రకాల ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ విధంగా ఇప్పటివరకు 30వేల మందికి విజ్ఞానాన్ని అందించాం.