విశాఖ

గ్రంధాయాలు సరస్వతీ నిలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, నవంబర్ 17: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్ధులకు చదరంగం పోటీలను పట్టణంలోని సమ్యమంతుల రెడ్డి హైస్కూల్‌లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషావతారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు అని, పుస్తకాలు చదవడం వలన విజ్ఞానం, జ్ఞానం , వినోదం, మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలోనూ గ్రంథాలయాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ముందుకు రావాలన్నారు. ఈకార్యక్రమంలో లేబ్రేరియన్ వి.లక్ష్మణరావు, ఫ్రధానోపాధ్యాయులు నరేష్ పాల్గొన్నారు.

మరుగుదొడ్లు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి

రావికమతం, నవంబర్ 17: చెత్త నుంచి సంపద తయారీ పథకం అమలుతో పాటు నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించిన నాడే ఆరోగ్య ఆంధ్రఫ్రదేశ్‌గా రాష్ట్రం మారనుందని ఎడీవో జయ ఫ్రకాష్‌రావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, స్వచ్చదూత్‌లకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో చైతన్య సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మరుగుదొడ్లు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. బహిరంగ మలవిసర్జన, అపారిశుధ్యం వలన ప్రబల రోగాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. చెత్త నుంచి సందప తయారీ కేంద్రాలను ఏర్పాటుకు విరివిగా ప్రభుత్వం రాయితీ ఇస్తున్నందున తక్షణం అన్ని పంచాయతీల్లో ఈకేంద్రాలను నిర్మించాలని కోరారు. మండలంలో 90 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారని దీని వలన స్వచ్చాంద్రప్రదేశ్ లక్ష్యం నెరవేరే అవకాశం లేదన్నారు. ఈకారణంగా స్వచ్చదూత్ పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి అపారిశుధ్యం వలన కలిగే నష్టాలను వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో ఇ ఓపీ ఆర్‌డీ మహేష్, ఆర్‌డబ్ల్యు ఎస్ సైట్ ఇంజనీర్ వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.

గుట్కా పాన్ మసాలా విక్రయాలపై కఠిన చర్యలు
* ఆర్డీవో విశే్వశ్వరరావు

నర్సీపట్నం, నవంబర్ 17: గుట్కా ,పాన్ మసాలా , నికోటిన్‌తో తయారు చేసిన చాక్లెట్లు వంటి నిషేధిత పదార్ధాలు విక్రయించుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వి. విశే్వశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యానికి హాని చేసే ఈపదార్ధాలు తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటివి చట్టరీత్యానేరంగా పరిగణించాలన్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రవాణా, కార్మిక శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి వీటిని నిరోధించాలన్నారు. నికోటిన్‌తో కూడుకున్న ఎటువంటి పదార్ధాలైనా మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు . ఈవిషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి వారి సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీ ఐ సింహాద్రినాయుడు, మున్సిపల్ కమీషనర్ జె.సురేంద్ర, మోటార్ వాహనాల ఇన్స్‌పెక్టర్ డి.సంజీవరావు, సహాయ కార్మిక శాఖాధికారిణి ఎం.రమ్య, పట్టణ ఎస్సై అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.