విశాఖ

డీ ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, నవంబర్ 17: ఎస్‌జీటీ , స్కూల్ అసిస్టెంట్ పోటీ పరీక్షలకు వెళ్ళే డీ ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు విశాఖ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం వార్డెన్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు బయోడేటాతో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. దరఖాస్తుతో పాటు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, మార్కుల సర్ట్ఫికెట్లు, టీసీ, 4 నుంచి 10 వరకు స్టడీ సర్ట్ఫికెట్, కుల, నివాస, ఆదాయ ధృవపత్రాలు, రేషన్, ఆధార్‌కార్డులు, రెండు ఫోటోలు జతపరచాలన్నారు.

విజయవంతంగా కొనసాగుతున్న చిత్రలేఖనం పోటీలు

కోటవురట్ల , నవంబర్ 17 : మండలంలో కోటవురట్ల, పాములవాక శాఖా గ్రంథాలయాల్లో గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈవారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక జూనియర్ కళాశాల విద్యార్ధినీవిద్యార్థులకు స్వచ్చ్భారత్‌పై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక గ్రంథాలయాధికారి ఎన్.రాజుబాబు, పాములవాక గ్రంథాలయాధికారి అప్పలనాయుడులు మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్చ్భారత్‌పై అవగాహన కల్పించేందుకు ఈపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు ఈనెల 20న బహుమతులు అందజేస్తామన్నారు. ఆదివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పాయకరావుపేట, నవంబర్ 17: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మండలంలోని కుమారపురం, రాజగోపాలపురం గ్రామాల్లో గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. కుమారపురం గ్రామంలో ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కుమారపురం గ్రామంలో సిమ్మెంట్ రోడ్లును నిర్మించామన్నారు. ప్రతీ గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పలాలను అందించడం కోసం ముందుండాలని కోరారు. ముఖ్యంగా మహిళలు పసుపు, కుంకుమ పథకం కింద మూడు విడతలుగా నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మహిళలు ఆర్దికంగా అభివృద్ధి చెందేందుకు బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్ళకే ఫించన్, ఒంటరి మహిళలకు ఫించన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. డప్పు కళాకారులకు ఫించన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో చెత్త సంపద కేంద్రాన్ని, వంతెనకు శంకుస్థాపన చేసారు. రాజగోపాలపురం గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కోసం బ్యాంకు ద్వారా రుణాలిస్తామన్నారు. గర్భిణీలకు శ్రీమంతాలు చేసారు. అనంతరం రాజానగరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 22 లక్షలతో ప్రహారీ గోడ , ఐదు లక్షలతో కమ్యూనిటీ భవనానికి శంకుస్ధాపన చేసారు . ఈకార్యక్రమంలో మండలాధ్యక్షుడు పి.చిట్టిబాబు, పాండురంగదేవస్ధానం చైర్మెన్ యాళ్ల వరహాలు, నీలాపు మహేష్‌రెడ్డి, రావాడ గోవిందరెడ్డి, సురేష్‌రెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.