విశాఖ

మునగపాక నుండి ప్రారంభమైన కరువుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, నవంబర్ 17: వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న మునగపాక మండల రైతులు గత మూడునెలలుగా వర్షాలు లేక తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడంతో ఆగ్రహించిన రైతన్న ఈనెల 12నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆరు రోజులుగా దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం తాడోపేడో తేల్చుకునేందుకు కరువుమండలంగా ప్రకటించాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం స్థానిక పిఎసిఎస్ కార్యాలయంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి రైతులు నివాళ్లు అర్పించారు. మునగపాక మండలంలో అరబుపాలెం, చూచుకొండ, గణపర్తి,తిమ్మరాజుపేట, వాడ్రాపల్లి, నాగులాపల్లి, ఒంపోలు గ్రామాల నుండి పెద్దఎత్తున రైతులు స్థానిక పీఎసిఎస్ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి అనకాపల్లి వెళ్లారు. అనకాపల్లి - అచ్యుతాపురం రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా భారీస్థాయిలో పోలీసులను రప్పించారు. కరువుయాత్ర ప్రదర్శన మునగపాక నుండి ప్రారంభమై అరబుపాలెం, గంగదేవిపేట, ఒంపోలు, నాగులాపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, సీపీఎం నేతలు బాలకృష్ణ, ఆళ్ల మహేశ్వరరావు, సీపీఐ నేతలు మళ్ల మాదవరావు, పెంటకోట సత్యనారాయణ, వైసీపీ నేతలు దాసరి అప్పారావు, ఎంపీపీ దాసరి గౌరిలక్ష్మి, మళ్ల సంజీవరావు, మళ్ల నాగసన్యాశిరావు, మహిళా రైతులు పాల్గొన్నారు.

గౌరీపరమేశ్వరుల పోస్టర్‌ను ఆవిష్కరణ

అనకాపల్లి, నవంబర్ 17: స్థానిక గవరపాలెం శ్రీ వినాయక గౌరీ సేవాసమితి పీలా వారి గౌరీపరమేశ్వరుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ శాస్వత ఆలయ చైర్మన్ భీమరశెట్టి వరహాలరాజు, ఉత్సవకమిటీ అధ్యక్షులు భీమరశెట్టి శ్రీనివాసరావులు తెలిపారు. స్థానిక పీలావారి గౌరీపరమేశ్వరుల ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు కొణతాల రఘునాథ్, ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనాయుడు డాక్టర్ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో గౌరీపరమేశ్వరుల ఉత్సవాలకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 29న సుమారు పదివేల మందితో కల్యాణం, భారీ అన్నసమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 18న వందమందితో కోలాటం, 19వ తేదీన శివపార్వతుల కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో నిరుద్యోగులకు శిక్షణా శిబిరం

అనకాపల్లిటౌన్, నవంబర్ 17: భారతదేశంలో అన్ని జిల్లాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలు ఘనంగా జరపాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువకులకు పరివర్తన, వ్యవస్థాపక అభివృద్ధి సాధించాలనే దానిపై ఈనెల డిసెంబర్ 3నుండి 7వ తేదీవరకు ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో నిరుద్యోగ యువకులకు శిక్షణా తరగతులు జరుగుతాయని వర్తకసంఘం అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ, కళాశాల కరస్పాండెంట్ కొణతాల బాలసుబ్రహ్మణ్యంలు తెలిపారు. శనివారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరాలకు దేశంలోని 115జిల్లాలకు మార్గదర్శక ఆవిష్కరణలు రూపొందిస్తూ వృద్ధిని సాధించాలనే దృఢనిశ్చయంతో జిల్లాలను ఎంపిక చేసారన్నారు. అందులో విశాఖజిల్లాలో ప్రప్రధమంగా ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈశిక్షణా శిబిరాలు నిర్వహించే అవకాశం రావడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఐదురోజులపాటు ఈ శిక్షణా తరగతుల్లో వృత్తినైపుణ్యత, స్వయం ఉపాధిని సులభతరం చేస్తూ వాటిపై తరగుతులు నిర్వహిస్తామన్నారు. బీటెక్, డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు ముందుగా దరఖాస్తుచేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆస్క్‌కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ప్రిన్సిపాల్, ప్రోగ్రామ్‌కోఆర్డినేటర్ డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్‌లను సంప్రదించి నవంబర్ 27లోపు దరఖాస్తులు చేసుకోవాలని వారు కోరారు.

గర్భిణీలకు వైద్య పరీక్షలు

కోటవురట్ల, నవంబర్ 17: అంగన్‌వాడీ కేంద్రంలో సుపోషణ పథకం కింద గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సహాలు అందజేస్తున్నారు. శుక్రవారం స్థానిక గొల్లపేట అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్ ఎస్తేరు రాణి ఆధ్వర్యంలో గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కుటుంబ సభ్యులకు గర్భిణీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్‌వాడీ టీచర్లు వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే పౌష్టికాహారాన్ని గర్భిణీలకు ఇవ్వడంలో సమయపాలన పాటించాలన్నారు. కుటుంబ సభ్యులు గర్భిణీలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిరోధక టీకాలు వేసారు. ఈకార్యక్రమంలో ఎ ఎన్ ఎం ప్రభామణి పాల్గొన్నారు.