విశాఖ

కరువు రక్కసిపై కదం తోక్కిన మునగపాక రైతన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 17: నెలలు తరబడి వర్షాలు లేకపోవడం, సాగునీరులేక కల్లేదుటే వరినాట్లు ఎండిపోతుండడం, తెగుళ్ళు సోగి చెరకు పంటది అదే పరిస్థితి. కేవలం వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే మునగపాక మండలం రైతాంగం ముందన్నుడులేని రీతిలో కరువు దుర్భిక్ష పరిస్థితుల్లో విలవిల్లాడిపోతున్నారు. సాగుఖర్చులు మాట ఎలా ఉన్నా కాయకష్టం సైతం దక్కే పరిస్థితి కనుచూపుమేరలో కానరాక విలవిల్లాడిపోతున్నారు. ఈ దుర్భిక్ష పరిస్థితులపై అధికార తెలుగుదేశం పార్టీ పాలకులు పట్టనట్లు వ్యవహరించడంతో రైతాంగం కనె్నర్రజేసింది. కరువు సహయక చర్యలుపై పాలకులను నిలదీసేందుకు మండలం రైతాంగమంతా ఒకేమాట, ఒకే బాటగా పోరుకు సన్నద్ధమయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్టక్రార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ సారధ్యంలో జరిగిన ఈ ఆందోళనా కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, వైసీపీ ఇతర ప్రజాసంఘాలు ఈనిరసన కార్యక్రమానికి బాసటగా నిలిచాయి. దీంతో మండల కేంద్రమైన మునగపాక నుండి అనకాపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్లు దూరంపాటు సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు పాదయాత్రగా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి శనివారం తరలివచ్చారు. జాతీయ రహదారి బైపాస్ రోడ్డుజంక్షన్‌లో ట్రాఫిక్‌ను స్తంభింపజేసి తమ నిరసన గళాన్ని వినిపించారు. ఎండ్లబండ్లను చుట్టూ ఉంచి తెగుళ్ళు సోకిన చెరకును, ఎండిన వరిపంటను దగ్ధం చేసి నిరసన తెలియజేసారు. ఇందుకు అడ్డుకున్న పోలీసు అధికారులతో వైసీపీ నేత ప్రసాద్, ఇతర రాజకీయపార్టీనేతలు వాగ్వాదానికి దిగారు.ప్రధాన రహదారి రాకపోకలను స్తంభింపజేసారు. ఎండిన వరిదుబ్బులు, తెగుళ్ళుసోగిన చెరకుగడలతో ఎండ్లబండ్లపై కాలినడకన రైతులు ఈ నిసరన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి మునగపాకను కరువుమండలంగా ప్రకటించాలి, తక్షణమే కరువు సహయక చర్యలు ఆమలుచేయాలి, వ్యవసాయ రుణాలు మాఫీచేయాలి అంటూ ప్లేకార్డులు దరించి రైతులు నినాధాలు చేసారు. ముందుగా తాము వస్తున్న సమాచారం తెలియచేసినప్పటికీ అర్డీవో సూర్యకళ అందుబాటులో లేకపోవడం పట్ల ఉద్యమకారులు నిరసన తెలియజేసారు.ముందు జాగ్రత్తచర్యగా అనకాపల్లి రూరల్ సిఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించి శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా కాపాడగలిగారు. అందోళన కారులను ఉద్ధేశించి ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కరువు విలయతాండవం చేస్తుండడంతో అల్లాడిన రైతాంగం వారం రోజులుగా మునగపాకలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పాలకులు పట్టనట్లు వ్యవహరించడం ఆన్యాయమన్నారు. మునగపాక మండలంలో తక్షణమే కరువు సహయకచర్యలు చేపట్టి వ్యవసాయమే ప్రధాన జీవనధారంగా భావించే ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఆర్డీవో సూర్యకళ ఈ నిరసనపై స్పందిస్తూ మండల రైతాంగమంతా కాలినడకను ఎండ్లబండ్లపైన తరలిరావడం తనను కలచివేసిందన్నారు.ఆందోళన కారుల వినతిపత్రం స్వీకరించిన ఆమె సమస్య తీవ్రతను పాలకుల దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా చూస్తానని బరోసా ఇచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు ఎబాలకృష్ణ, సిపిఐ నాయకులు మళ్ళ మాధవరావులు మాట్లాడుతూ జిల్లా పర్యటనకు విచ్చేసిన సిఎం చంద్రబాబు కరువు రక్కసిపై స్పందించకపోవడం అన్యాయమన్నారు. కరువు సమస్యలుపై పాలకులు స్పందించే వరకు ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని పాటిపల్లి రైతునాయుకులు ఆడారి త్రిమూర్తులు, మునగపాక ఎంపిపి దాసరి లక్ష్మి, మాజీ జెడ్‌పిటిసి మళ్ళ సంజీవరావు తదితరులు హెచ్చరించారు. అమ్‌హద్మిపార్టీ నాయుకులు కొణతాల హరినాధ్‌బాబు, పిఎసిఎస్ అధ్యక్షులు టెక్కలి కొండలరావు, ఎంపిటిసి మళ్ళ నాగ సన్యాసిరావు, రైతు నాయుకులు ఆళ్ళ మహేశ్వరరావు, తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలు నుండి రైతులు అనూహ్యసంఖ్యలో తరలివచచ్చి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేడు భూలోకమాంబ అమ్మవారి జాతర

అనకాపల్లి టౌన్, నవంబర్ 17: చోడవారం మండంలో రాయుపురాజుపేటలో కులువైయున్న శ్రీ భూలోకమాంబ అమ్మవారి జాతర ఆదివారం అత్యంత వైభంగా నిర్వహించడానికి దేశం మండల పార్టీ అధ్యక్షులు బొడ్డేడ నాగ గంగాధర్, ఎంపిటిసి బొడ్డేడ రామునాయుడు, మాజీ సర్పంచ్ అచ్చయ్యమ్మ గ్రామస్తుల అధ్వర్యంలో భారీ ఏర్పాటు చేసారు.ప్రతీ ఏటా కార్తీక మాసం నాగుల చవితి వెళ్ళిన మరసటి ఆదివారం అమ్మవారి జాతర చేయడం పూర్వీకులనుండి వస్తున్న ఆచారం. ఆర్ధిక ఇబ్బందులు, సంతానం, తదితర సమస్యలుపై అమ్మవారిని వేడుకుంటే కోరికలు నెరవేరుతాయని రాయుపురాజుపేట, నర్సాపురం, శేమునాపల్లి తదితర గ్రామల ప్రజలకు గట్టినమ్మకం. ఈనేపధ్యంలో ఆదివారం జరగనున్న అమ్మవారి జాతరకు రాయుపురాజుపేట గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ముందురోజు రాత్రి గ్రామంలో అమ్మవారి పుట్టక పాటను నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేసారు. జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ లైటింగ్‌తోపాటు పూల దండలతో స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామం పురవీధుల్లో భారీ విద్యుత్ లైటింగ్‌ను ఏర్పాటు చేసారు. ఆ గ్రామానికి ఇదే పెద్దపండుగ కావడంతోబందువులను, స్నేహితులను అహ్వనించి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. బతుకు తెరువుకోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు ఎక్కడ ఉన్నా అమ్మవారి జాతరకు కుటుంబ సభ్యులుతో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. సాయత్రం అమ్మవారి జాతర సందర్భంగా భారీ స్టేజి ప్రదర్శనలుతోపాటు మందుగుండు, నేలవేషాలు, చిటికల భజనలు, వివిధ అమ్మవార్ల వేషధారణలుతో భారీ ఏర్పాట్లుతో అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తారు. దీంతో ఆ గ్రామంలో ఎక్కడ చూసిన జన సంద్రంతో వీదులన్నీ కిటకిటలాడి సందడి నెలకొంటుంది.

వేతనాల జివోను తక్షణం అమలుచేయాలి

అనకాపల్లి టౌన్, నవంబర్ 17: వేలుగు ఉద్యోగులకు సంబందించి వేతన జివోను తక్షణం అమలుచేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసరావు అన్నారు. సిహెచ్ రూప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో వేలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం వేలుగు సిబ్బందికి జివోను ఆమలుచేసి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో కీలకపాత్ర వహిస్తున్న వేలుగు సిబ్బందికి వేతనాలు విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీసవేతనాలు అమలుచేయాలన్నారు. కొన్ని మండల కేంద్రాల్లో విఓఎలపై కక్ష సాధింపు చర్యలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వివిధ మండలాలు నుండి వచ్చిన విఓఎలు తెలిపారు. వెలుగు సిబ్బంది అంతా ఐక్యతగాఉంటే సమస్యలుపై పోరాటం చేసి సాధించుకోవచ్చునన్నారు. ఈ సమావేశంలో యూనియన్ కోశాధికారి వెంకటేష్, త్రినాధ్, గౌరీ, భాను పాల్గొన్నారు.

విద్యార్థుల చదువుపట్ల ఉపాధ్యాయులు శ్రద్ధచూపాలి

చోడవరం, నవంబర్ 17: విద్యార్థుల చదువుపట్ల ఉపాధ్యాయులు తగిన శ్రద్ధచూపాలని ఉపాధ్యాయులు సూచించారు. శనివారం మండలంలోని జుత్తాడ ప్రాధమిక పాఠశాలలో విశాఖడెయిరీ ఆర్థిక సహాయం రెండులక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన విద్యార్థుల స్టడీ టేబుళ్లను ఎమ్మెల్యే అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువుపట్ల విద్యార్థులు తగిన శ్రద్ధచూపాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అందుచే ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల హాజరుశాతాన్ని పెంపుచేయడంతోపాటు అధికశాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధచూపాలన్నారు. అలాగే క్రమశిక్షణ, మంచి నడవడితోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా అలవర్చుకోవాలన్నారు. అంతకుముందు ఆయన పాఠశాలలో ఉన్న సరస్వతీదేవి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యాకమిటీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజును ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జిజె సుందర్‌సింగ్, మాజీ సర్పంచ్ మళ్ల అప్పలసత్యనారాయణ, ఎంపీటీసీ ఆళ్ల చిన్నప్పడు,మాజీ ఎంపీపీ ఆళ్ల కోటేశ్వరరావు, పీలా వెంకట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

చోడవరం పట్టణ బంద్‌ను జయప్రదం చేయాలి

చోడవరం, నవంబర్ 17: ఇటీవల ఇంటర్ చదువుతున్న మైనర్ విద్యార్థిని హత్యకు గురైనప్పటికీ ఆ కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు శ్రద్ధచూపలేదని యాదవ సంఘ, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. శనివారం స్థానిక హార్డింజ్ రెస్ట్‌హౌస్ ఆవరణలో హతురాలి కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకోవాలని, కిరాతకంగా హత్యచేసిన నింధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈనెల 19వ తేదీన చోడవరం పట్టణ బంద్‌ను నిర్వహించతలపెట్టామన్నారు. ఈ బంద్‌ను రాజకీయ పక్షాలు,ప్రజాసంఘాలు మద్దతునివ్వాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పినబోయిన అప్పారావుయాదవ్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి, సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్‌వి నాయుడు, గొర్రెల, మేకల పెంపకందారుల సహకార యూనియన్ జిల్లా చైర్మన్ గంటా శ్రీరామ్, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సియాద్రి శ్రీనివాసరావు, రైతుసంఘం కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు బంద్ విజయవంతానికి అందరూ కృషిచేయాలని ఈ సందర్భంగా కోరారు.

నింధనలు అతిక్రమిస్తే తగుచర్యలు

చోడవరం, నవంబర్ 17: అనధికారికంగా బెల్టుమద్యం షాపులు, అక్రమ ఇసుక తవ్వకాలు, కోడిపందాలు నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. శనివారం ఇక్కడి విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు కోడిపందాలు ఆడుతున్న 40మందిని అదుపులోకి తీసుకుని సుమారు రెండులక్షల 39వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహించిన, మద్యం బెల్టుషాపులు, కోడిపందాలు చేపడితే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా లైసెన్స్‌లు లేని దాబాలను కూడా సీజ్ చేస్తామన్నారు. పట్టణంలోని ఇటీవల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు పోలీస్ సిబ్బంది ఫీల్డ్‌లో ఉండి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. అలాగే శనివారం దుడ్డుపాలెం గ్రామంలో కోడిపందాలు ఆడుతున్న ఇద్దరిని అరెస్టుచేయడంతోపాటు నాలుగుకోళ్లను, 9600రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.