విశాఖపట్నం

శంఖారావం విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: స్వచ్ఛ రాజకీయాలకు పవన్‌కళ్యాణ్ ఇస్తున్న సందేశాన్ని సామాన్యులకు తెలిపే విధంగా విశాఖలో ఈ నెల 18వ తేదీన ఆదివారం గురజాడ కళాక్షేత్రంలో జరుగనున్న జనసేన శంఖారావం విజయవంతం చేయాలని జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. సీతమ్మధార, బృందావనం పార్కు సమీపానున్న జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి సంపత్ వినాయక గుడి మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో జరుగనున్న సభ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కో-ఆర్డినేటర్ ఎం.రవికుమార్, జనసేన నాయకులు గుంటూరు నర్శింహమూర్తి, మైలిపల్లి శ్రీనివాస్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
=====

తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో వైద్యశిబిరం
ఆరిలోవ, నవంబర్ 17: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే వైద్య శిబిరాన్ని రాంబిల్లి మండలం వాడచీపురుపల్లిలో శనివారం ప్రారంభించారు. 12మంది నిపుణులతో కూడిన వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఐఎన్‌హెచ్‌ఎస్ కళ్యాణికి చెందిన సర్జికల్ ఆర్థోపెడిక్, పేథాలజీ, గైనికాలజీ, డెర్మటాలజీ, ఇఎన్‌టీ తదితర విభాగాలకు చెందిన నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానికంగా 305 మందికి వైద్య పరీక్షలు జరిపారు. వీరిలో 200మంది విద్యార్థులు ఉన్నారు.
======

సీబీఐ సాహసొపేతమైన నిర్ణయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
జగదాంబ,నవంబర్ 17: రాష్ట్రప్రయోజనాలు,అభివృద్ధి దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐ నిరోధకంపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని నగర సీనియర్ న్యాయవాది పీవీ గిరిధర్ అన్నారు. నగరంలో జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాలు, వాటి సామాగ్రి,సంబంధించి లంచగొండి తనం అవినితీ నిరోధించడానికి దేశంలో 1941లో స్పెషల్ పోలీస్ ఎస్టాబిలిష్‌మెంట్ యాక్ట్‌గా 1946గా మారి 1963లో చట్టం తాలుకా అవసరాన్ని గుర్తించి సీబీ ఐ ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ చట్టానికి లోబడి సీబీ ఐ అధికారం ఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే వారి కార్యకలాపాల కొరకు ఆయా రాష్ట్రాల నుంచి కన్‌సంట్ తీసుకొవాల్సి ఉంటుందన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆసరగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కనీస సమాచారం లేకుండా కేసులు పెట్టడం సరికాదున్నారు. విశాఖ పోర్టు, మైన్స్, సెంట్రల్ కాంట్రాక్ట్ లేబర్ తదితర సంస్థలో వేల కోట్ల అవినితీ పాతుకుపోయాయాని, ఇవి సీబీ ఐకీ కనిపించవా అంటూ ఏద్దెవా చేశారు. మన రాష్ట్రంలోనే సమర్థవంతమైన సీ ఐడీ, ఏసీబీ విజిలెన్స్ ఇతర శాఖలు ఉన్నాయని, అందుకే ఏ అంశంలో తీసుకున్న లా అండ్ అర్డర్ క్రైం అవినితీ అన్ని మన రాష్ట్రంలో చాలా తక్కువు స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో పలువురు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.