విశాఖపట్నం

ఆశల పల్లకిలో రైల్వేజోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: రైల్వేజోన్ ఇపుడు ఆశల పల్లకిలో ఊరేగుతోంది. అసలు ఇది వస్తుందా? లేదా? లేదంటే దీని గురించి పూర్తిగా మరచిపోవడమేనా? అయితే రకరకాలైన ప్రచారాలు ఎందుకు జరుగుతున్నట్టు? ఎన్నికల కోసమే మళ్ళీ ప్రచారం చేస్తారా? అనేవి ఉత్తరాంధ్ర ప్రజానీకంలో మెదులుతున్న సందేహాలు. ఖచ్చితంగా ఇది వస్తుందనే విషయం నుంచి అసలు అవకాశమే లేదనే వాదన రైల్వేవర్గాల నుంచి వినిపిస్తుండగా, దీని గురించి ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయని, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు ఇంకా నమ్మబలుకుతున్నారు. ఎదీ ఖచ్చితమనేది ప్రజానీకంలో సందిగ్ధంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కాస్తంత విడిపోవడం, ఎన్నికలు జరగడం వరుసగా జరిగిపోయాయి. ఎన్నికల్లో ప్రధానమైన అజెండాగా తీసుకున్న ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌పై హామీలిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోను ఇవి ఉన్నాయి. అయినా ఇప్పటివరకు వీటి ఊసేలేదు. కేంద్రంలో బీజెపీ, దీనికి మద్దతునిచ్చే ఏపీలో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వాలు ఏర్పడి నాలుగున్నరేళ్ళు పూర్తయ్యింది. రాష్ట్ర విభజన జరిగినా ఈ రెండు హామీల ద్వారానే ఇవి అధికారంలోకి వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జోన్ గురించిన హామీతోనే సరిపెడుతున్నారు. మధ్యలో కమిటీల పేరుతో కొంత కాలయాపన జరిగింది. దీని తరువాత సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామంటూ మరికొన్నాళ్ళపాటు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇంకొన్నాళ్ళపాటు జోన్ అనేది 3పొలిటికల్ డిజిసన్2గా మారిపోయింది. రైల్వేపరంగా తాము జోన్ ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తే సరిపోతుందని కూడా రైల్వే ఉన్నతాధికారులు కొన్నాళ్ళపాటు చెబుతూ వచ్చారు. ఈ విధంగా కమిటీ నివేదికలు బుట్టదాఖలయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరిహద్దుల సమస్యలు తలెత్తుతున్నాయని, భారతీయరైల్వేకు ఆర్ధిక వెన్నుముకగా నిలిచే వాల్తేరుడివిజన్ పరిధిలో సరుకు రవాణా జరిగే కిరూండల్ ప్రాంతాన్ని ఏ డివిజన్‌లోకి తీసుకురావలనే సందిగ్ధంలో రైల్వేపడింది. జోన్‌కు తమ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎపుడూ లేనివిధంగా ఒడిశా ప్రభుత్వం, అక్కడి ప్రజాప్రతినిధులు సైతం స్పష్టంచేశారు. అలాగే దక్షిణమధ్య రైల్వే నుంచి సరిహద్దుల సమస్యలు తలెత్తకుండా ముందుగానే రైల్వే జాగ్రత్తలు తీసుకుంది. అన్ని విధాలుగా జోన్‌కు సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జోన్ ఏర్పాటుకు సంబందించి అధికార ప్రకటన జరగడంలేదు. దీనిపైనే ఇపుడు ఉత్తరాంధ్రవాసులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. గత నాలుగున్నరేళ్ళు ఆశలు పెట్టి ఇపుడు తీరా దీని ఊసే లేకుండా చేసేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
* విశాఖపై రైల్వే వివక్ష....
ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్‌కు విశాఖపట్నం ముఖద్వారం కాగా, దక్షిణమధ్యరైల్వేకు చివరి స్టేషన్‌గా దువ్వాడ నిలుస్తోంది. అయితే ఒక విదంగా చెప్పాలంటే సదుపాయాలు పొందడంలోను, కొత్త రైళ్ళను సాధించుకోవడంలోను, చివరకు తగినన్ని నిధులు మంజూరులోను ఈ డివిజన్ ఎపుడూ చివరే ఉంటోంది. ఈ విధంగా ఎపుడూ వాల్తేరుడివిజన్ వివక్షకు గురవుతూనే ఉంది. ఖచ్చితంగా వచ్చి తీరుతుందనే వాదన ఏళ్ళతరబడి వినిపిస్తున్నా, చిరకాల డిమాండ్ అయిన రైల్వేజోన్‌ను కనీసం ఏపీ విడిపోయి నవ్యాంధ్రాప్రదేశ్‌గా ఏర్పడిన తరువాత అయినా వచ్చి తీరుందని ఉత్తరాంధ్రవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలు ఇంకా సడలడంలేదు కూడా.
* ఒకే ఒక్క బడ్జెట్‌కు అవకాశం...
ఎన్నికలు జరిగేలోపు ఒకే ఒక్క బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అదీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే దీని గురించి మాట్లాడేందుకు వీల్లేకుండా పోతుంది. అందువల్ల ఈ కొద్దిరోజుల్లోపే జోన్ గురించి ఏమైనా ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే దీనిపై రైల్వేవర్గాల నుంచి సందేహాలు వ్యక్తమవుతుండగా ప్రజాప్రతినిధులు మాత్రం స్పష్టత రావడంలేదు.
* రోడ్డెక్కని ఉద్యమాలు....
బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే రైల్వేజోన్ గురించిన ఉద్యమాలు నిర్మాణాత్మకంగా జరగకపోవడమే దీనికి ప్రధాన కారణంగా విశాఖవాసులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధికోసమో, ఎన్నికల సందర్భంగానో జోన్ పదాన్ని వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలనే తీవ్ర పోరాటాలు నిర్మించలేకపోతున్నారని, ఉత్తరాంధ్ర ప్రజలు, స్వచ్చంధ సేవా సంస్థలు ఎటువంటి ఉద్యమాలకైనా సంసిద్ధత వ్యక్తంచేస్తున్నా దీనిని నడిపించే నాధులే కరవయ్యారనే వాదన నెలకొంది. జోన్ అనేది ప్రజాప్రతినిధుల ప్రచారానికే ఉపయోగపడుతోంది. తప్పితే ఇది ఖచ్చితంగా సాధించుకుతీరాలనే లక్ష్యంతో పోరాటాలు చేపట్టే స్ఫూర్తి ఎక్కడా కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
======

యాంటీబయోటిక్స్ వాడకంలో అప్రమత్తత అవసరం
* జిమ్‌సర్ అవగాహనా సదస్సులో వైద్యులు
విశాఖపట్నం, నవంబర్ 17: రోగ నివావరణకుగాను ఉపయోగించే యాంటీ బయోటిక్ ఔషధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సత్వర నివారణ చర్యగా అవసరం లేకున్నా వీటిని వాడకం మంచిదికాదని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ అండ్ రీసెర్చి (జిమ్‌సర్) వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ యాంటీబయోటిక్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శనివారం జిమ్‌సర్‌లో జరిగిన సదస్సులో వైద్యులు పాల్గొన్నారు. జిమ్‌సర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌పీ రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జిమ్‌సర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్యామప్రసాద్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ పి.హేమప్రకాష్ కుమారి, సామాజిక వైద్య విభాగం అధికారి డాక్టర్ సంజీవకుమార్, డాక్టర్ శారద, డాక్టర్ తులసీ మాధవి పాల్గొని ప్రసంగించారు. యాంటీబయోటిక్స్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరం మేరకు వాడాల్సిన విధానాలను, యాంటీబయోటిక్స్ మితిమీరిన వాడకం వల్ల కలిగే అనర్ధాలను వైద్యులు చర్చించారు.

====

18న భారత ఆర్ధిక వ్యవస్థ పుస్తక పరిచయం
* పౌరగ్రంథాలయంలో నిర్వహణ * ఆచార్య పీ.బాబీవర్ధన్
విశాఖపట్నం, నవంబర్ 17: భారత ఆర్ధిక వ్యవస్థ నిర్మాణ క్రమంపై ఆదిభట్ల విద్యాసాగర్ పరిశోధించి రచించిన 3్భరత ఆర్ధిక వ్యవస్థ2 రెండు పుటల పరిచయ సభ ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్టు సెంటర్ ఫర్ ఇండిపెండెంట్ రీసెర్చ్ (సీఎఫ్‌ఐఆర్) గౌరవ సలహాదారు ఆచార్య పీ.బాబీవర్ధన్ తెలిపారు. విశాఖ పౌరగ్రంథాలయంలో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. రచయిత టైటానిక్ సురేష్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వక్తలుగా జగన్నాధస్వామి, ప్రసాదవర్మ, కాశీవిశే్వశ్వరరావు తదితరులు పాల్గొంటారన్నారు. సీఎఫ్‌ఐఆర్ ముద్రించిన రెండు సంపుటాల్లో తొలి సంపుటి 1857 నుంచి 1947 వరకు జరిగిన చరిత్రను, రెండో సంపుటిలో ఇదే కాలంలో పెట్టుబడి, వాణిజ్యం, జాతి, ఆర్ధికం రూపుదిద్దుకున్న క్రమాన్ని విశదీకరించారు. ఆదిభట్ల విద్యాసాగర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 114 గ్రామాల్లో వచ్చిన సామాజిక, ఆర్ధిక మార్పులు, అవి ప్రజాజీవితంపై తీసుకువచ్చిన మార్పులను అస్పుటం చేస్తూ ఓ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని పల్లెన మింగిన పెట్టుబడి పేరుతో పీకాక్స్ ముద్రం సంస్థ పుస్తక రూపం కల్పించింది. నాలుగు సంపుటాలుగా భారత ఆర్ధిక వ్యవస్థ రచన సాగింది. ఆదివారం ఉదయం పౌరగ్రంథాలయంలో జరిగే పుస్తక పరిచయ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, సామాజిక అధ్యయనకారులు, సాహితీవేత్తలరు, సామాజిక అధ్యయనకారులు, సాహితీవేత్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

=====

బాబు...ఏమీ మా జాబు...
* బీజెవైఎం ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ
విశాఖపట్నం, నవంబర్ 17: భారతీయ జనతా యువమోర్చా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు పిలుపు మేరకు బాబు..ఏదీ మా జాబు...గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం బీజెపీ నగర కార్యాలయంలో బీజెవైఎం నగర ఉపాధ్యక్షులు సంపతిరావు దిలీప్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సురేంద్రమోహన్ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతీ జిల్లాలో రాష్టమ్రంతటా నిర్వహించాలన్నారు. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేవైఎం ఏపీ నిలదీయడమే కాకుండా వారికిచ్చిన హామీల సాధన కోసం బీజెవైఎం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజెవైఎం రాష్ట్ర కార్యదర్శి నెమలి విశ్వతేజ, బీజెపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, బీజెవైఎం నగర ప్రధాన కార్యాదర్శి ధోని నాగరాజు, బీజెవైఎం నగర కార్యదర్శి కొత్తకోట కుమార్ రాజా, కాళ్ళ అశోక్, బీజెవైఎం నగర కార్యదర్శి బీ.శివకుమార్, నగర కార్యవర్గ సభ్యులు టీ.శ్రీనివాస్, బీజెవైఎం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.