విశాఖపట్నం

హోంగార్డుల సేవలు మరువలేనివి.....సీపీ లడ్హా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 6: పోలీసులతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సేవలు మరువలేనివని నగర పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా కొనియాడారు. హోంగార్డుల 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం కార్ పోలీసు గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖకు అనుబంధ సంస్థగా హోంగార్డ్సు శాఖ ముఖ్య పాత్రను పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో రక్తదానం చేసిన 35మంది హోంగార్డులకు, స్పోర్ట్స్, సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన బహుమతులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీసీపీలు ఎన్ రవీంద్రనాద్, అద్మాన్ నరుూం అస్మీ, ఎఆర్ దామోధర్, ఆర్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన 217వ బ్యాచ్ పౌర రక్షక వౌళిక కార్యక్రమం
విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 6: నగరంలోని శాంతిపురంలో గల పౌర రక్షణ సంస్థలో 217వ బ్యాచ్ పౌర రక్షణ వౌళిక ముగింపు కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెట్రోపాలిటన్ కమిషనర్ పి. బసంత్‌కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు ప్రదర్శించిన విన్యాసాలు అక్కడివారిని అబ్బుర పరిచాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పడం, ఎతె్తైన భవనాల నుండి కాపాడడం, ప్రాధమిక చికిత్స చేయడం, వార్డెన్ సర్వీసులను చక్కగా ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీప్యూటీ సీడీ కంట్రోలర్ జి జవహార్‌లాల్‌నెహ్రూ, శిక్షణ పొందిన వారంటీర్లు, తెతదితరులు పాల్గొన్నారు.

ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు టీడీపీదే: ఎమ్మెల్యే పల్లా
గాజువాక, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడి పోయిన తరువాత రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధ్యతులను స్వీకరించారన్నారు. అయితే చంద్రబాబు ముందు అనేక ఇబ్బందులు ఉండేవి అని వాటిని అధికమించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని ఆయన స్పష్టం చేశారు. కష్టాల్లో సైతం రాష్ట్రాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుత్వా నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలను ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు దశాబ్ధాలగా అపరిషృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే కార్యకర్తల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న టీడీపీకి దేశంలోనే అత్యధిక సభ్యులు ఉన్నారన్నారు. టీడీపీ నేత ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గొర్లె వెంకునాయుడు, గంధం శ్రీనివాసరావు, మహ్మద్ రఫీ, టీడీపీ నాయకులు పప్పు రాజారావు, పులి వెంకటరమణారెడ్డి, గోమాడ వాసు, విజయకుమార్, నమ్మి సింహాద్రి, చట్టి గోపి, కనకరావు తదితరులు పాల్గొన్నారు.