విశాఖపట్నం

పేదల బతుకుల్లో వెలుగులు అంబేద్కర్ రాజ్యాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: పేదల బతుకుల్లో వెలుగులు నింపిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని రాష్ట్ర మానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం నగరంలోని వాడవాడలా ఆయన వర్ధంతి వేడుకులను ఘనంగా నిర్వహించారు. మంత్రి గంటా డాబాగార్డెన్స్ సమీపానున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బడుగులకు ఆశాజ్యోతిగా నిలిచిందన్నారు. * ఏయూలో....
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో గురువారం అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా ఏయూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య,విద్యాశాఖ, గిరిజనశాఖామంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేథావి, నవభారత రాజ్యాంగ నర్మిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచనా విధానం ఎంతో ముందు చూపుతో భారత రాజ్యాంగాన్ని రచించడం వలనే భారతదేశంలో ఎన్నో సమస్యలకు సమాధానంగా పేర్కొన్నారు. ఎంతోమంది పేదవర్గాల బతుకుల్లో వెలుగులు నింపి బడుగుల ఆశాజ్యోతిగా మిగిలారని కొనియాడారు. ఈ రోజు ఆయన దయవలనే అతి చిన్న వయసుసలో తాను మంత్రిని కాగలిగానని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులు, తన తండ్రి ప్రేమ కూడా తోడ్పాటునందించిందన్నారు. ఆయన చూపిన మార్గం ఈ దేశంలో అన్ని సమస్యలకు పరిష్కారమని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం ఆయన మార్గమే ఈ దేశ సమస్యలన్నింటికీ శరణ్యమన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు పిల్లలు వృద్ధుల రక్షణకు, అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. భారతదేశ తొలి న్యాయశాఖామంత్రిగా అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య కోటి జాన్, ఆచార్య షారోన్‌రాజు, ఆచార్య ప్రేమానందం ఆచార్య బసవయ్య, ఆచార్య మునుస్వామి, ఆచార్య రమేష్, ఆచార్య కూడా నాగేశ్వరరావు, ఆచార్య శోభ శ్రీ, ఆవాల రమేష్, నాయకులు డాక్టర్ బోరుగడ్డ మోహన్‌బాబు, ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి యువజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ విశాఖ జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు యంవీ ప్రణవ్‌గోపాల్, విశాఖ జిల్లా టీడీపీ ఎస్పీ సెల్ అధ్యక్షులు పుచ్చా విజయ్‌కుమార్, సుధీర్‌పాల్ వైయస్సాఆర్ విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మండే సురేష్, ఏయూ యన్‌యస్‌యు అధ్యక్షుడు అబ్రహం సుమంత్, సుధీర్‌పాల్, టీవీ రాఘవులు కొయ్యా ఆనంద్‌కుమార్, త్రినాథ్, రమేష్, ఏయూ నాన్ టీచింగ్ వైస్-ప్రెసిడెంట్ సురేష్, ఎస్‌స్సీ,ఎస్టీ టీబీసీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజు, కుమార్‌స్వామి, డాక్టర్ రాజేష్, సురేంద్రరాజు, రవి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
* ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా గురువారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సంస్థ కార్పోరేట్ కార్యాలయం ప్రాంగణంలోని బాబా బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టీవీయస్ చంద్రశేఖర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సామాజిక అస్పృశ్యతపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం నిరుపమానమన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, తన జీవితాన్ని దారపోసిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్ధికవేత్తగా, రాజకీయవేత్తగా, న్యాయశాస్త్ర కోవిదునిగా, స్వాతంత్ర సమరయోధునిగా, గొప్ప సంఘసంస్కర్తగా ఆయన నిర్వర్తించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు, ఏపీయస్‌ఇబీ ఎస్సీ,ఎస్టీ ఎంప్లారుూస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.సాయిబాబు, సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బీ.రమేష్‌ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్లు కెయస్‌యన్ మూర్తి, పీ.నాగేశ్వరరావు, ఓ.సింహాద్రి, వి.విజయలలిత, పీవీవీ సత్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు, జీ.శ్రీనివాసరెడ్డి, జీ.శరత్‌కుమార్, కార్పోరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
* ఏయూలో....
సమ సమాజం దేశ వికాసం అంబేద్కర్ ఆశయం అని ఏయూ వీసీ ఆచార్య జీ.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉదయం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏయూని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ సమానహక్కులు, సమాన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు ఉండాలన్నారు. దశాబ్ధాలు గడచినా ధృడమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను యువతరం ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరాంజన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.రామమోహనరావు, అంబేద్కర్ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య టీ.శోభశ్రీ, డీన్‌లు, అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ ‘సీ’ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వర్సిటీ వీసీ ఆచార్య జీ.నాగేశ్వరరావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.రామమోహనరావు, డి.సూర్యప్రకాశరావు, డీన్ ఆచార్య ఎంవీఆర్ రాజు, అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య పీ.అర్జున్, కోశాధికారి ఆచార్య ఎన్‌ఏడి పాల్ కార్యనిర్వాహాక సభ్యులు ఆచార్య నల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు రక్తదానం చేశారు.
* నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో....
చిరస్మరణీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఎల్‌ఐసీ భవనం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని, దేశాభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. నాడు రాజ్యాంగం రచించడం వలన దేశ ప్రజలు ప్రాథమిక హక్కుల ఫలాలను అనుభవిస్తున్నారన్నారు. రాజ్యాంగం రచన నాటి కాంగ్రెస్ హయాంలో జరగడం ఆనందదాయకమన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా విశేష కృషి చేసి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో మరచిపోలేని విషయమన్నారు. కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుకులు బెహరా భాస్కరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రమణికుమారి, మాజీ కార్పొరేటర్ జగ్గుపల్లి అప్పలరాజు, అఖిలభారత యువజన కాంగ్రెస్ ఎన్నికల అధికారి వేగి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు సర్వ శ్రీను, యర్రంశెట్ట శ్రీనివాస్, గొంపా గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
* విశాఖ పోర్టులో...
విశాఖపట్నం పోర్టుట్రస్టులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపోర్టు ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరిపారు. దీనికి పోర్టుట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబఉ, డిప్యూటీ చైర్మన్ డిఎల్ హరనాథ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పోర్టు ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విశాఖ పోర్టు ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్‌బీ అప్పన్న, ప్రధాన కార్యదర్శి డీ.శ్రీనివాస్‌లు కానె్వంట్ జంక్షన్‌లో వర్ధంతి కార్యక్రమానికి నిర్వహించారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు, డిప్యూటీ చైర్మన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, పోర్టు ఉన్నతాధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరితోట అంబేద్కర్ కాలనీ స్కూల్ చిన్నారులకు నోటు పుస్తకాలు చైర్మన్ పంపిణీ చేశారు.
* ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో...
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త కెకె రాజు ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి బీసీ రాష్ట్ర కార్యదర్శి రాయుడు శ్రీనివాసరావు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ జిల్లా యస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్నా, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గోవింద్, రెయ్యి వెంకటరమణ, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
* సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో...
వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగకా పార్టీ నాయకులు పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వామపక్ష నాయకులు గంగారావు, ఎం.పైడిరాజులు మాట్లాడుతూ బీజెపీ మతన్మోదాలు రెచ్చగొడుతూ కులమతాల మధ్య విద్వేసాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి జేడీ నాయుడు, డి.మార్కేండేయులు, ఈశ్వరరావు తదితరులు పాల్గన్నారు.
* 41, 31 వార్డుల్లో...
నగరంలోని 41, 31 వార్డుల్లో శ్యామ్‌నగర్, రైల్వేన్యూకాలనీ చాకలిపేట రెల్లివీధి, రెల్లివీధి ప్రాంతాల్లో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకులు శ్యామ్‌నగర్ ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. దీనికి వార్డు టీడీపీ నాయకులు కార్తిక్, పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అ లాగే 31వ వార్డులో చాకలిపేట రెల్లివీధిలో అంబేద్కర్ విగ్రహానికి వార్డు టీడీపీ అధ్యక్షుడు నాగేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పిచారు.
* జనసేన ఆధ్వర్యంలో...
దళితులు సంక్షేమం అంటూనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కులవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం దారుణమని జనసేన నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు రేపుతున్న టీడీపీకి దళితులే త్వరలో బుధ్ధి చెబుతారన్నారు. పార్టీ నాయకులు పాకా సత్యనారాయణ, మండవ రవికుమార్, మద్దెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
* వైసీపీ ఆధ్వర్యంలో....
దళితు అభ్యున్నతి పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అణగారిన వర్గాలను అణగదొక్కుతున్నాయని వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్ అన్నారు. వైసీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ నాయకులు రొయ్యి వెంకటరమణ, బోను శివరామకృష్ణ సంయుక్త సెల్ నాయకులు రొయ్యి వెంకటరమణ, బోరు శివరామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
* డీహెచ్‌పీఎస్, కేవీపీ ఆధ్వర్యంలో....
దేశవ్యాప్తంగా లౌకికవాద రక్షణ, రాజ్యాంగం పరిరక్షణ దినంగా అంబేద్కర్ వర్ధంతిని పాటిస్తున్నామని డీహెచ్‌పీఎస్ కన్వీనర్ బి.వెంకటరావు అన్నారు. ఆయన విగ్రహానికి డీహెచ్‌పీఎస్, కేవీపీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యనారాయణ, కేవీపీఎస్ నాయకులు ఆర్పీ రాజు, తదితరులు పాల్గొన్నారు.
* మాలమహానాడు ఆధ్వర్యంలో...
మాలమహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ 62వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాలమహానాడు అధ్యక్షుడు పారిపల్లి రామారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రతినిధులు పిహెచ్ చలం, ఈతలపాక సుజాత, ఈశ్వరరావు, కోన ప్రకాష్, రవితేజ, లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.