విశాఖపట్నం

కచ్చితంగా ఇది అధికార నిర్లక్ష్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఏళ్ల తరబడి సాగిన నిర్లక్ష్యం ఇప్పుడు నీళ్ల రూపంలో పీడిస్తోంది. భవిష్యత్‌లో నీటి ఇబ్బందులు గుర్తించి పర్యావరణ విభాగం చేసిన హెచ్చరికలు విస్మరిస్తే ఎం జరుగుతుందో జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ తదితర ప్రాంతాల ప్రజలు చవిచూస్తున్నారు. అధికారుల ఉదాశీనత, నిర్లక్ష్యం ఇప్పుడు దాదాపు రెండు లక్షల మంది ప్రజలకు తాగునీటి ఇక్కట్లను తెచ్చిపెట్టింది. ఆరిలోవను ఆనుకుని ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ దాదాపు ఒక ఎంజీడీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు రిజర్వాయర్‌ను ఎడాది చేసింది. దీనికి కారణం ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడమే కారణం. కేంద్ర పర్యావరణ విభాగం కంబాలకొండ చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల ప్రాంతాన్ని అత్యంత సెన్సిటివ్ జోన్‌గా 2013లో ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఉన్న 14గ్రామాల ప్రజానీకానికి అవసరమై మంచి పర్యావరణం, నీటి వసతులు అందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అలాగే ఈ సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వచ్చే శంభువానిపాలెం మినీ రిజర్వాయర్‌ను పరిరక్షించుకోవడం ద్వారా భవిష్యత్‌లో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని సూచించింది. అయితే జీవీఎంసి, అటవీశాఖ యంత్రాంగం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆరిలోవ ప్రాంతంలో నివాస ప్రాంతం వరకూ నీటి అవసరాలు తీర్చుకునే బోర్లను పక్కపెడితే, హెల్త్‌జోన్ ఏర్పాటుతో ఇక్కడ భూగర్భ జలాల హరణం మొదలైంది. పెద్ద సంఖ్యలో వెలిసిన, ఇప్పటికీ నిర్మాణం జరుగుతున్న కార్పొరేట్ ఆసుపత్రులు భారీ బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తున్నాయి. దీనిపై జీవీఎంసీ కనీస నియంత్రణ లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల నీటి దోపిడీ యధేచ్ఛగా సాగిపోతోంది. ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన జీవీఎంసీ కమిషనర్ కార్పొరేట్ ఆసుపత్రులు జీవీఎంసీ నుంచి బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భ జలాలను వినియోగించరాదని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక శంభువాని పాలెం మినీ రిజర్వాయర్ విషయంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది.
కంబాలకొండ అతితీవ్ర సెన్సిటివ్ జోన్ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై నగరానికి చెందిన ప్రజాసంఘ నాయకుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ స్పందిస్తూ కంబాలకొండ ప్రాంతంలోని అతితీవ్ర సెన్సిటివ్ జోన్ పరిరక్షణ విషయమై తాను సెంట్రల్ ఎంపవర్‌మెంట్ కమిటీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. దీనితో పాటు ముడసర్లోవ రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ నిర్మాణలు, సువిశాల రహదార్ల వల్ల కూడా కాలువలు మూసుకుపోయాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్‌లో మరింత సంక్షోభం తప్పదని హెచ్చరించారు.