విశాఖ

స్థానిక సమస్యలపై పోరుకు సన్నద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 10: మండలంలోని సత్యనారాయణపురం మెగా లేఅవుట్ నివాసాలు అద్దె ఇళ్లను తలపిస్తున్నాయని ఇటువంటి సమస్యలపై పోరుకు పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలని వైసీపీ అనకాపల్లి లోక్‌సభ కమిటీ అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని నర్సింగరావుపేట 31వ వార్డులో కావాలి జగన్, రావాలి జగన్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో అమర్‌ప్రసంగించారు. సత్యనారాయణపురం మెగా లేఅవుట్‌లో పేదలకు ఇళ్లు ఇస్తున్నామని అధికార పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, మూడు నెలలు బ్యాంక్ రుణం చెల్లించకపోతే సంబంధిత ఇంటికి అధికారులు తాళాలు బిగించరని హామీ ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంక్ రుణంపై ఇచ్చే ఇళ్లకు ఉచిత నివాసాలుగా ప్రచారం చేసుకోవడం పాలకులకు తగదన్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ఇటువంటి స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి వారిలో పోరాట పటిమను పెంపొందింపజేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అమర్ స్పష్టం చేసారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఎక్కడికక్కడే స్థానికులు తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. నవరత్నాల పథకం పేరిట జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, జగన్‌కు అధికారం కట్టబెట్టేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం కావడం తధ్యమని, అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రివర్గంలో స్థానం పొందడం తధ్యమన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పట్టణ వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ వైసీపీను ప్రజల ముంగిటకు తీసుకెళ్లి వారిలో చైతన్యం పెంచేందుకు ఇటువంటి సమావేశాలు దోహదపడతాయన్నారు. అనకాపల్లి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఒత్తిడి పెంచుతామన్నారు. పట్టణ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, యువజన నాయకులు పలకా రవి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు, కుండల రామకృష్ణ, గైపూరి రాజు, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.