విశాఖ

యువతకు క్రీడలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(రూరల్), డిసెంబర్ 10: నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం రానున్న రోజుల్లో క్రీడా హబ్‌గా రూపుదిద్దుకుంటుందని స్థానిక డీ ఎఫ్ ఓ జి.శేఖర్‌బాబు అన్నారు. నర్సీపట్నంలో అయ్యన్న క్రికెట్ ఛాంపియన్ లీగ్ పోటీలకు ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి స్పోర్ట్స్ కోటాలో అవకాశాలు లభిస్తాయన్నారు. యువ క్రీడాకారుల్లో ఈపోటీలు ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. అనంతరం అయ్యన్నయువసేన అధ్యక్షులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ యువతలో ఉన్న టాలెంట్‌లను వెలికి తీసేందుకు ఈపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ యువతకు అరుదైన అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించాలని కోరినా కుదరని తాము నిర్మొహమాటంగా చెప్పడం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ఆటంకం కలిగించాలని కొందరు స్వార్ధ పరులు పిచ్‌ను ధ్వంసం చేసేందుకు చూసారన్నారు. ఇరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. క్రికెట్ పోటీలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు గ్రౌండ్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పోటీలు సజావుగా సాగేందుకు ప్రత్యేక కమిటీ వేసామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతిగా లక్ష, రెండవ బహుమతి 50వేలు, తృతీయ బహుమతి 20 వేలు ఇస్తామన్నారు. ఫైనల్‌కు చేరిన ఐదు జట్లుకు డై అండ్ నైట్ పోటీలు నిర్వహించేందుకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈపోటీలు కులాలు, రాజకీయాలు, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈపోటీల్లో 103 టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. ఈపోటీలు 42 రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రమణమ్మ, తెలుగుదేశం పార్టీ రూరల్ అద్యక్షుడు ఎల్.శ్రీరంగస్వామి, కౌన్సిలర్లు,క్రీడాకారులు పాల్గొన్నారు.
విజయవంతమైన ఉచిత మెగా వైద్యశిబిరం
కోటవురట్ల, డిసెంబర్ 10: మండలంలో పాములవాక పట్టాలమ్మ అమ్మవారి గుడి వద్ద రెండు రోజులు నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. ఈవైద్యశిబిరంలో 800 మందిరోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేసారు. 80 మందికి వినికిడి మిషన్లు అందించారు. వైద్యశిబిరం నిర్వాహకులు ఎస్‌వీ రమణ మాట్లాడుతూ విశాఖ కేర్, అపోలో, సెవెన్‌హిల్స్, మైక్యూర్, కిమ్స్ తదితర వైద్య సంస్థల నుండి 10 మంది వైద్య నిపుణులు ఈప్రాంత ప్రజలకు వైద్య సేవలందించారన్నారు. ఆధునాతన మిషన్లతో ఉచిత వైద్య సేవలందించామన్నారు.

సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి పంచాయతీలు ముందుకు రావాలి
కోటవుటర్ల, డిసెంబర్ 10: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పంచాయతీలు ముందుకు రావాలని నర్సీపట్నం డీ ఎల్‌పీ ఓ శిరీషారాణి పిలుపునిచ్చారు. మండలంలో రామచంద్రపురంలో సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శిరీషారాణి , మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్, ఎడీవో కళ్యాణి ప్రారంభించారు. ఈసందర్భంగా శిరీషారాణి మాట్లాడుతూ దీనిలో వానపాములు వేసామన్నారు. నెల రోజుల్లో చెత్తను సేంద్రీయ ఎరువులుగా మారుస్తాయన్నారు . ఈవిధంగా తయారైన ఎరువును కిలో 10 రూపాయలు వంతున విక్రయించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా పంచాయతీలకు ఆదాయంతో పాటు పంచాయతీలు పరిశుభ్రంగా తయారవుతాయాన్నరు. ఈకర్యక్రమంలో ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.