విశాఖ

సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, డిసెంబర్ 10: సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ అధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు స్థానిక డిపోఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిపో అధ్యక్ష కార్యదర్శిలు బివిఎస్ సత్యనారాయణ, కె బిక్కుబాబులు అధ్వర్యంలో దీక్షలు ప్రారంబించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ రీజన్‌లోఉన్న పలు సమస్యలపై మేనేజ్‌మెంటు వారు తీసుకుంటున్న వ్యతిరేక చర్యలు వలన ఉద్యోగులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోంటురన్నారు. అనకాపల్లి డిపోలో 500వి బస్సులు పనిభారం తగ్గించాలని, కోడ్ ఆఫ్ డిసిప్లెయిన్ తప్పనిసరిగా ఆమలుచేయాలని, అక్రమ ఓడి లను రద్దుచేసి ప్రమోషన్‌లను ఇవ్వాలని తదితర సమస్యలుపై నినాధాలు చేసి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏకె జిలానీ, జిఎస్ బాబు, రాజు, డిఎ లక్ష్మి, కె రమణి, ఎడి రాణి దీక్షల్లో పాల్గొన్నారు.

యోగా లైఫ్ నుండి ఇద్దరు జాతీయ స్థాయి యోగాపోటీలకు ఎంపిక
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 10: యోగా పోటీల్లో రాష్టస్థ్రాయి నుండి జాతీయ స్థాయికి ఎంపికైన తుమ్మపాల గ్రామానికి చెందిన యోగా లైఫ్ సెంటర్ నుండి మాదేటి వైష్ణవి, బుదిరెడ్డి నర్సింగరావులను పంచాయితీ రాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందించి ఘనంగా సత్కరించారు. ఈనెల 8,9 తేదిల్లో నర్సీపట్నం టిటిడీ దేవస్ధానంలో జరిగిన రాష్టస్థ్రాయి యోగా పోటీల్లోపాల్గొని యోగసనాలు వేయడంలోతమ 32వ ప్రతిభను చాటుకొని 50 నుంచి 60ఏళ్ళు పురుషుల విభాగంలో నర్సింగరావురెండు స్థానం సాధించారు. 8నుండి 14ఏళ్ళు లోపు బాలికల విభాగంలో మాదేటి వైష్ణవి మూడోవ స్ధానం కైసవం చేసుకుంది. అలాగే ఈనెల 28నుండి మూడురోజులు పాటు మద్రాసులో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లుప్రకటింటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి అయ్యన్న వీరిద్దరినీ అభినందించి సత్కరించారు. వీరికి యోగా లైఫ్ అధ్యక్షులు కరణం బాబూరావు, టీచర్ రమాదేవి,ఎం జగన్ సభ్యులు కె జోగినాయుడు, కె శంకర్‌బాబు, బి వెంకటరమణ, కె రామారావు, ఆర్ లలిత తదితరులు అభినందించారు.
జిడీఎస్ కార్మికుల తొలగింపుపై అర్డీవోకు వినతి
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 10: మండలంలోని తుమ్మపాలలో ఉన్న జీడీఎస్ కంపెనీలోఏళ్ళ తరబడి పనిచేస్తున్న 14మంది కార్మికులను విధులు నుండి తోలగించడంతో సోమవారం సిఐటియు అధ్వర్యంలో అర్డీవో సూర్యకళకు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా సిఐటియు నాయుకులు బుద్ద శ్రీనివాసరావు, దాకారపు శ్రీనివాసరావులు మాట్లాడుతూ వేతన విషయంలో సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరినందుకు కార్మికులపై కక్షగా పెట్టుకొని నిర్ధాక్షణ్యంగా విధులు నుండి తోలగించిందన్నారు. యాజమాన్యంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో పి అచ్చయ్యనాయుడు, కె రాఘవ, వి రామునాయుడు, పి వీరునాయుడు, ఎం అచ్చతాంబ తదితరులు పాల్గొన్నారు.
భారత సనానతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం
కోటవురట్ల, డిసెంబర్ 10: భారతదేశ సనాతన ధర్మం, ఆచార సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బాల బ్రహ్మాంద స్వామి తెలిపారు. సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన కోటవురట్లలో హిందూ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా ర్యాలీ నిర్వహించి హిందూ సాంస్కృతిక ఆచారాలను చాటి చెప్పే చిడతల భజనలు, కోలాటం, చెట్టు భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సమ్మేళనం సభలో బాలబ్రహ్మానంద స్వామి మాట్లాడుతూ హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలు ఆరోగ్యం, గౌరవ మర్యాదలు ఇమిడి ఉన్నాయన్నారు. విదేశాలు సైతం మన దేశ అలవాట్లును పాటిస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఉత్తరాంధ్రా మహిళా ప్రతినిధి ఇందిరాదేవి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్.గంగబాబు, సమరసత సేవా సంస్థ మండల కన్వీనర్ ఎన్. సత్యనారాయణ, డివిజన్ ధర్మ ప్రచారక్ ఆడారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.