విశాఖపట్నం

నేడు పూణె-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 20: రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ వరుణ దేవుడి కటాక్షం మీద ఆధారపడింది. శుక్రవారం ఉదయం వర్షపు జల్లులు కురిసినా మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం నిలిచిపోవడంతో క్రికెట్ అభిమానుల్లో మ్యాచ్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. పోటీకి ఆతిథ్యం ఇస్తున్న ఎసిఎ-విడిసిఎ స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పేయడంతో చిరుజల్లులు కురిసినప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టేడియంలో చక్కని డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో కొంత మేర తడచినా మ్యాచ్‌కు మాత్రం అడ్డంకి ఏర్పడే అవకాశాలు లేవు. శుక్రవారం రాత్రి భారీ వర్షం పడకుండా ఉన్నట్టయితే మ్యాచ్ జరగడానికి ఎలాంటి ఢోకా లేదు.
ఫలితంపై ప్రభావం లేని మ్యాచ్
పూణే, పంజాబు జట్లు రెండు 8 పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో నిలవడంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచిన మిగతా జట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పటికే రెండు జట్లు లీగ్ దశలోనే వైదొలగడంతో ఎలాంటి వత్తిడి లేకుండా రెండు జట్లు ఆడే అవకాశం ఉంది. అయితే చివరి స్ధానంలో నిలవడానికి ఏ జట్టు ఆశించదు కాబట్టి పదో స్ధానం కాగా, రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. పంజాబ్, పూణే జట్లు 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశాయి. ఈ రెండు జట్లకు ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్.
నగరంలో పూణే ఆటగాళ్ల సందడి
రైజింగ్ పూణే సూపర్ జైంట్లి ఆటగాళ్లు నగరంలో సందడి చేశారు. వీరు శుక్రవారం మధ్యాహ్నాం స్పెన్సర్ షాపింగ్‌కు వచ్చారు. ఈ సంగతి తెలిసిన మీడియా, ప్రేక్షకులు పూణే ఆటగాళ్లను కలవడానికి ఎగబడ్డారు. వర్షం కారణంగా రెండు రోజులుగా హొటల్‌కు పరిమితమైన రెండు జట్ల ఆటగాళ్లు నగరంలో తిరిగే పనిలోపడ్డారు. నోవాటెల్‌లో గురువారం జిగిన మీట్ అండ్ గ్రాట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అభిమానులను అలరించిన పూణే ఆటగాళ్లు స్పెన్సర్స్‌లో కొంత సేపు షాపింగ్ చేశారు. ఆశాక్య రహినే, అశోక్‌దిండే, రవిచంద్ర అశ్విన్, చాహిల్, అపరాజిత్ షాపులోని అన్ని విభాగాలలో కలియతిరిగారు. ఫుట్‌బాల్ బంతిని పట్టుకొని అభిమానులకు ఫొటొలో ఫోజులిచ్చారు.
మరోసారి ఆకట్టుకున్న జంపా
ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్ హైదరాబాద్‌పై ఆరు వికెట్లు, డిల్లీ డేర్ డెవిల్స్‌పై మూడు వికెట్లు పడగొట్టిన పూణే బౌలర్ జంపా మరోసారి తన అద్భుత ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న జంపా గుగ్గీలు ఈ మ్యాచ్‌లో కూడా పంజాబ్ బ్యాట్స్‌మ్యాన్‌ను దెబ్బ తీస్తాడో లేదో వేచి చూడాలి.
పంజాబ్ జట్టు నుండి గౌవల కారణంగా మాక్సివెల్ వైదొలగడంతో ఆ జట్టుకు గట్టి దెబ్బతగిలింది. ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్న మాక్సివెల్ జట్టులో లేకపోవడం ఆట్టును కుంగదీస్తొంది.