విశాఖపట్నం

జివిఎంసి ఎన్నికలకు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా జివిఎంసి ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రసంగించి కార్యకర్తల్లో కదలిక తెచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదన్న కార్యకర్తల నిర్వేదాన్ని పారద్రోలడంతో పాటు వారి ఆశలకు అనుగుణంగానే ఎన్నికల రణక్షేత్రంలో ముందుకు సాగుదామని చెప్పకనే చెప్పారు. అంకోసా సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన విశాఖ అర్బన్ జిల్లా మినీ మహానాడులో మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జివిఎంసికి ఏక్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచి వార్డుల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రజలతో మమేకమైన అభ్యర్థులను గుర్తించడంతో పాటు గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. విశాఖకు అంతర్జాతీయ గుర్తింపునిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విశాఖకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విశాఖ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాలంటే జివిఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందితీరాలని స్పష్టం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జివిఎంసి ఎన్నికలు ఏకపక్షం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సారి మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని, మేయర్‌గా తెలుగుదేశం అభ్యర్థి విజయం చారిత్రాత్మకం కావాలన్నారు. రెండేళ్ల కాలంలో తెలుగుదేశం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా వారి మన్ననలు చూరగొనాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న వారి కోసం క్రమబద్దీకరణ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసిందని, ఆమేరకు పలువురు అర్హులకు లబ్దిచేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కార్యకర్తలకు తెలుగుదేశం మనోధైర్యాన్ని కల్గిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో పలువురు కార్యకర్తలు మిత్రపక్షంతో పొత్తుపై అభ్యంతరాలను వ్యక్తపరచగా, అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని భరోసానిచ్చారు. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయగా, నియోజకవర్గంలో టిడిపి తరపున ఇన్‌ఛార్జీని నియమించేందుకు నిర్ణయించారు. సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జ్ రామానాయుడు, ఎమ్మెల్యేలు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌బాబు, పీలా గోవింద్ పాల్గొన్నారు.