విశాఖ

మీ సేవా కేంద్రాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 17: మీ సేవా నిర్వాహకుల అసోషియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నుండి డివిజన్ పరిధిలోని మీ సేవా ఆపరేటర్లు సమ్మె చేపట్టారు. మీసేవా కేంద్రాలను మూసివేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ ధరలను పెంచి నెలకు 18వేలకు పైగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఆపరేటర్ మృతి చెందితే 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఐదు కిలో మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని, ఫైబర్ గ్రిడ్ ద్వారా ఉచిత నెట్ సౌకర్యం కల్పించాలని, ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని , ప్రభుత్వ స్థలాల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా భవన నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేసారు. ఈ ఆందోళనలో జీటీ ఎస్ రాజు, విజయ్, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే ఉద్యమాలు
నాతవరం, జనవరి 17: సమస్యల పరిష్కారానికి కార్మక సంఘాలు మమేకం కావాలని భూ నిర్వసితుల సంఘ అధ్యక్షుడు వై ఎస్సార్ పార్టీ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కోటమ్మతల్లి ఆటో యూనియన్ సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సంఘ యూనియన్ సభ్యులతో పాటు నడిపించే నాయకుల నుండి ఎంతో బలోపేతం ఉంటే సమస్యలు అంతే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. మాకవరపాలెం, అన్‌రాక్ పరిశ్రమకు నాతవరం మండలం సరుగుడు నుంచి లేటరైట్‌గా తరలిపోతున్న బాక్సైట్‌ను ఈ పరిశ్రమకు ఇవ్వగలితే నర్సీపట్నం నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. దీనిపై గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి మీ సహకారం కావాలన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు గవిరెడ్డి నర్సింహం, భీమరాజు, వెంకటరమణ,సూరిబాబు, జి.రాజుబాబు, ఈర్లె గోపీ, రుత్తల లింగేశ్వరరావు, ఎం. అప్పలనాయుడు, గంగధర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

నిన్ను నమ్మం బాబూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
* నేటి నుండి మున్సిపాలిటీలో ప్రారంభం
నర్సీపట్నం, జనవరి 17: మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నుండి వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే నిన్ను నమ్మం బాబూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆపార్టీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గం స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగిస్తున్న మోసపూరిత పాలనను ప్రజల్లో ప్రచారం చేసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిన్ను నమ్మం బాబూ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు . రానున్న ఎన్నికల్లో వైసీపీ అదికారంలోకి రావడం , జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను ఈసందర్భంగా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఈకార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. అన్ని వార్డుల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఓటర్ల జాబితాలపై బూత్ కమిటీ కన్వీనర్లు దృష్టి సారించాలని సూచించారు. చేర్పులు, మార్పులతో ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని ఈజాబితాల్లో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలన్నారు. పార్టీ సానుభూతి పరుల పేర్లు లేకపోతే చేర్చేలా చూడాలన్నారు. ఈసామవేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తమరాన అప్పలనాయుడు, వైసీపీ పట్టణాధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మాకవరపాలెం, నాతరవం, గొలుగొండ మండలాల పార్టీ అధ్యక్షులు రుత్తల సత్యనారాయణ, శెట్టి నూకరాజు, రాయపురెడ్డి నాగేశ్వరరావు , చిటికెల భాస్కరనాయుడు, అంకంరెడ్డి జమీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.