విశాఖ

అంతర్జాతీయ స్థాయిలో అరకులోయకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 17: ప్రకృతి అందాలకు నిలయమైన అరకులోయను అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు బృహత్తర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌మీనా తెలిపారు. స్థానిక పర్యాటక శాఖ ఇష్టాగోష్టి మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్థిల్లితున్న అరకులోయను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలోని అందమైన ప్రదేశాలతో పాటు కృత్రిమంగా మరిన్ని ఆహ్లాదకరమైన దృశ్యాలను ఏర్పాటు చేసి పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. స్వదేశీ పర్యాటకులే కాకుండా విదేశీ పర్యాటకులు సైతం అధిక సంఖ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆయన చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకపరంగా అభివృద్ధి చేసి అంతరాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా చూస్తామని ఆయన అన్నారు. విశాఖ మన్యంలోని పర్యాటక కేంద్రాలలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, పర్యాటకులకు వినోదం కలిగించేవి ఏమిటి, ఈ ప్రాంత వనరులను వినియోగించుకుని భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న అంశాలపై అఖిల భారత అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల ప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యాటకుల సందర్శన సంఖ్యను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. పాడేరు ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించేందుకు అడ్వంచర్ టూర్ ఆపరేటర్లు ఇచ్చే ప్రతిపాదనలు ఎంతో దోహదపడగలదని ఆయన అన్నారు. అరకులోయ పరిసర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏడు కోట్లు, బొర్రా గుహల పరిసరాల్లో అభివృద్ధి పనులకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. పాడేరు ఐ.టి.డి.ఎ., గిరిజన సహకార సంస్థ సహకారంతో కనుమరుగౌతున్న వలిసెపూల సాగును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పర్యాటకుల మదిని దోచే వలిసెపూల సాగు దినదినానికి అంతరిస్తున్న కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు. డుంబ్రిగుడ మండలం అడపవలస సమీపంలో వెలుగుచూసిన గుహలు, మత్స్యగుండం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారికి సూచించినట్టు ఆయన చెప్పారు. అఖిల భారత అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘ నిర్వాహకుల సలహాలు, సూచనలు తీసుకుని గిరిజన యువకులు ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ముఖేష్‌కుమార్ మీనా కోరారు. అనంతరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 25 మంది యువతీ యువకులను ఆయన అభినందించారు. విలేఖరుల సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి, సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, పర్యాటక శాఖ ఎం.డి. హిమాంశు శుక్లా, అఖిల భారత అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు స్వదేశ్‌కుమార్, వైభవ్‌కాల, రాజేష్ ఓజా, శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల వార్షికోత్సవం
అరకులోయ, జనవరి 17: మండలంలోని చొంపి పంచాయతీ కొత్తవలస గిరిజన వ్యవసాయ ప్రదర్శన, శిక్షణా క్షేత్రంలో అఖిల భారత అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం 14వ వార్షికోత్సవం గురువారం ప్రారంభమయ్యింది. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవ సమావేశాల్లో దేశం నలుమూలల నుంచి టూర్ ఆపరేటర్లు పాల్గొంటున్నారు. అడ్వంచర్ టూర్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, కొత్త అవకాశాలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ సమావేశాల సందర్భంగా కొత్తవలస ఉద్యానవన కేంద్రంలో భారీ టెంట్లు, స్టాల్స్ ఏర్పాటు చేసారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక పర్యాటక శాఖ అతిధి గృహంలో పలు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అఖిల భారత అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం 14వ వార్షికోత్సవ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రిన్సిపాల్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా అడిగి తెలుసుకున్నారు. అడ్వంచర్ టూర్ ఆపరేటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించి వార్షికోత్సవ వేడుకలు విజయవంతమయ్యేలా పర్యాటక అధికారులు, సిబ్బంది సహకరించాలని ఆయన ఆదేశించారు.