విశాఖపట్నం

ప్రారంభమైన జిల్లా యూత్ పార్లమెంట్ ఎంపిక ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, ఆంధ్రాయూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్, నెహ్రు యువకేంద్ర సంయుక్త నిర్వహణలో నేటి నుండి ఈ నెల 25వ తేదీన జరగబోయే జిల్లా యూత్ పార్లమెంట్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ భవన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జాతీయ సేవాపథకం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఆచార్య ఆర్‌డీ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, ఎంపికైన యువతీ,యువకులు, ఈ నెల 25వ తేదీన ఏయూ టిఎల్‌ఎన్ సభాహాలులో నిర్వహించే జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్‌లో పాల్గొంటారన్నారు. ఒక్క జాతీయ సేవాపథకం నుండే కాకుండా 18 నుండి 25ఏళ్ళలోపు వయస్సు గల యువతీ,యువకులు ఎవరైనా ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. అభ్యర్థులు 3మహిళా సాధికారిత2 లేదా 3సామాజిక, ఆర్ధిక సాధికారత2 లేదా నివాస యోగ్యత,అవినీతి నిర్మూలన అనే అంశాల్లో ఏదో ఒక దానిపై రెండు నిమిషాలు, తెలుగు, ఇంగ్లీషు,హిందీలో ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లాయూత్ పార్లమెంట్ నోడల్ అధికారి డాక్టర్ కె.మాణిక్యకుమారి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా యువతకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులుగా జాతీయ సేవాపథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపీఎస్ భాగ్యలక్ష్మి, నెహ్రు యువకేంద్ర ప్రతినిధి ఏ.రాంప్రసాద్, ప్రముఖ న్యాయవాది రెహమున్నీసా భేగం వ్యవహరించార. 17, 18, 19 తేదీల్లో ఈ ఎంపిక ప్రక్రియ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు అయిన గురువారం యువత నుంచి దీనికి విశేష స్పందన లభించింది.