విశాఖ

ఎన్‌టీఆర్ స్ఫూర్తి ప్రదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాతగా విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. ఎన్‌టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్కే బీచ్‌లోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ వర్థంతిని సంకల్పదినంగా పాటించాలన్నారు. మహానేత వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లోనూ సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అంతకు ముందు నగర పార్టీ కార్యాలయంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరంలో వాసుపల్లి స్వయంగా రక్తం దానం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింప చేసిన నేత ఎన్‌టీఆర్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావంతోనే తెలుగువారికి గుర్తింపు వచ్చిందని, అందుకు ఎన్‌టీఆర్ కారణమన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్‌టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతినార్జించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు భరత్, పార్టీ నగర కార్యదర్శి చోడే పట్ట్భారామ్, మాజీ కార్పొరేటర్లు ఆళ్ల
శ్రీనివాస్, పైల ముత్యాల నాయుడు, పార్టీ నాయకులు గొర్లె సూర్యనారాయణ, డబ్ల్యూ భాస్కర రావు, ఈతలపాక సుజాత, దాడి సత్యనారాయణ, గొర్లె అప్పారావు, చిన రెహ్మాన్, పాశర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో 100 మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
28వ వార్డులో
జీవీఎంసీ పరిధి 28వ వార్డులో టీడీపీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ఎన్‌టీఆర్ మారుపేరన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలల్లో అధికారం చేజిక్కించుకున్న ఘనత ఎన్‌టీఆర్‌కు దక్కుతుందన్నారు. అణగారిన వర్గాలు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని, ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడిన మహానేత ఎన్‌టీఆర్ ఎన్నటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అంతకు ముందు ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధి విల్లూరి తిరుమలదేవి, సత్య, మాధవి, సరిత, గౌరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు శక్తి ఆధ్వర్యంలో
తెలుగు శక్తి ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్‌టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆర్కే బీచ్‌లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం గతంలో ఎన్‌టీఆర్ పోరాడారని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో కేంద్రంపై పోరాడేందుకు టీడీపీ సమాయత్తమైందన్నారు. పార్టీలకు అతీతంగా అంతా మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వీసీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, కాకర్ల సుజాత, తెలుగుశక్తి కార్యదర్శి వీ వంశీబాబు, లాడే కిషోర్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

గంట ముందుగానే పరీక్షకు హాజరుకావాలి
* డీఎస్సీ అభ్యర్థులకు డీఈఓ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 18: ఏపీ డీఎస్సీ 2018 రెండో విడత ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ఉదయం పరీక్షకు 8 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కంప్యూటర్ల వద్ద 15 నిముషాల ముందు అంటే 8.45, 1.45 గంటలకు సిద్ధంగా ఉండాలన్నారు. అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డులు అనుమతిస్తామన్నారు. అలాగే దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్ ఏర్పాటు చేసే నిమిత్తం అభ్యర్థులు వికలాంగ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. సమయం దాటిన తరువాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, గొలుసులు, ఉంగరాలు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు.

డీఐజీ శ్రీకాంత్ బదిలీ
* నూతన డీఐజీగా పాల్‌రాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 18: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతున్నాయి. విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీకాంత్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో విజయనగరం ఎస్పీ జీ పాలరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీఐజీ శ్రీకాంత్ (2002 బ్యాచ్)ను ఏపీ టెక్నికల్ సర్వీసెస్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న పాలరాజు (2005 బ్యాచ్)కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. విశాఖ రేంజ్ నుంచి బదిలీ అయిన శ్రీకాంత్ 2016 మే 12వ తేదీన బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలు తక్కువగా మూడేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఆయనను టెక్నికల్ సర్వీసెస్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేసి 24 గంటలు గడవక ముందే డీఐజీని బదిలీ చేయడం గమనార్హం. జిల్లా ఎస్పీగా పనిచేసిన రాహుల్‌దేవ్ శర్మ స్థానంలో బాబూజీ అట్టాడ కొద్ది నెలల కిందట బాధ్యతలు చేపట్టారు. ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ను మావోయిస్టులు మట్టుబెట్టిన నేపథ్యంలో అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై బదిలీ వేటు పడిందన్న ప్రచారం జరిగింది. అయితే శర్మకు జంట హత్యల కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది.

గీతంలో ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
విశాఖపట్నం, జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావు వర్ధంతిని గీతం డీమ్డ్ యూవర్శిటీలో శుక్రవారం నిర్వహించారు. గీతం యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ ముఖ్యఅతిధిగా ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డీవీజీడీ బాలాజీ, గీతం ఇనిస్టిట్యూట్స్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ కే లక్ష్మీప్రసాద్, ప్రొఫెసర్ ఎస్ గణపతి, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అరకులోయలో బెలూన్ ఫెస్టివల్ ఆరంభం
అరకులోయ, జనవరి 18: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో రెండో విడత ఇంటర్ నేషనల్ హట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమయ్యింది. ఆంధ్ర ఊటి అరకులోయలో నిర్వహిస్తున్న అతి పెద్ద బెలూన్ ఫెస్టివల్‌ను పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి ప్రారంభించారు. గిరిజన యువకులతో కలిసి బెలూన్ బుట్టలో ఎక్కి విదేశీ ప్రతినిధుల సమక్షంలో గాలిలో విహరించారు. దేశంలోనే పెద్దదైన ఈ ఫెస్టివల్‌లో 15 దేశాలకు చెందిన ఔత్సాహికులు 20 హట్ బెలూన్లతో విన్యాసాలు చేస్తున్నారు. అమెరికా, ఇంగ్లాడ్, రష్యా, కెనడా, మలేషియా, సిట్వర్లాండ్, బ్రెజిల్, ఆస్ట్రెలియా, దక్షిణ కొరాయాతో సహా పదిహేను దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న బెలూన్ ఫెస్టివల్‌ను ఈ సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాలుగు కోట్ల రూపాయలను వెచ్చించి చేపడుతున్న ఈ వేడుకకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసారు. అరకులోయలో మొదటి సారి 2017వ సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ వాతావరణం అనుకూలించక అనుకున్నంతంగా విజయవంతం కాలేదు. భారీ వర్షాల కారణంగా ఈ ఉత్సవం దెబ్బతినడంతో తూతు మంత్రంగా దీనిని చేపట్టి చేతులు దులుపుకున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని బెలూన్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. అరకులోయలో తొలిసారి నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌ను మన దేశానికి చెందిన రెండు బెలూన్లు, పదమూడు దేశాల నుంచి పదహారు బెలూన్లు విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే ఈ సారి మాత్రం పదిహేను దేశాలకు చెందిన ప్రతినిధులతో 21 బెలూన్లతో విన్యాసాలు చేపడుతూ చూపరులను కనువిందు చేస్తున్నారు. దేశంలో 21 బెలూన్లతో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే ప్రప్రధమం కావడం విశేషం. సముద్ర మట్టానికి అత్యంత ఎతె్తైన భాగంలో ఉన్న అరకులోయలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడం అనుకూలంగా ఉండడంతో పర్యాటక శాఖ ఈ వేడుకకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు వరుసగా మూడు రోజుల పాటు నిర్వహించే బెలూన్ ఫెస్టివల్‌లో ప్రజలను భాగస్వామ్యం చేసారు. అయితే దట్టంగా కురుస్తున్న పొగ మంచు, చలిగాలుల కారణంగా బెలూన్లను ఎగురవేసే సమయాలను కొద్దిపాటి మార్పులు చేయాల్సి వచ్చింది. ఉదయం ఆరు గంటలకు బెలూన్లను ఎగురవేయాల్సి ఉండగా పొగ మంచు కారణంగా దీనిని తొమ్మిది గంటలకు మార్పు చేసారు. బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం రోజు విభిన్న ఆకారాలతో కూడిన బెలూన్లను ఎగురవేయడంతో పలువురు ఆశక్తిగా వీటిని వీక్షించారు. జోకర్, గుడ్డు, తేనెటీగ, బేబి కారు ఆకారాలు గల బెలూన్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ బెలూన్లు గాలిలో నాలుగు వేల అడుగుల ఎత్తుకు ఎగిరి అమితంగా ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగే బెలూన్ ఫెస్టివల్‌కు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అరకులోయ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు చలిని కూడా లెక్క చేయకుండా ఈ వేడుకలను వీక్షించేందుకు తరలివస్తుండడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. బెలూన్ ఉత్సవం ప్రారంభోత్సవంలో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా, పర్యాటక శాఖ జిల్లా అధికారులు ప్రసాదరెడ్డి, పూర్ణిమాదేవి, ఫెస్టివల్ బృంద నాయకుడు కెప్టెన్ కరీంముల్లా సయ్యద్, ఆర్గనైజర్ సుమిత్ గార్గ్, అఖిల భాతర అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విప్లవాత్మక మార్పులకు ఎన్.టి.ఆర్. శ్రీకారం
అరకులోయ, జనవరి 18: సమాజంలో విప్లవాత్మక మార్పులకు దివంగత నేత ఎన్.టి.రామారావు శ్రీకారం చుట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. ఎన్.టి.ఆర్. 23వ వర్థంతిని పురస్కరించుకుని స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానంలోని ఎన్.టి.ఆర్. విగ్రహానికి ఆయన శుక్రవారం పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానీయుడు ఎన్.టి.ఆర్. అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్.టి.ఆర్. పనిచేసిన కాలంలో ప్రజలకు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను అమలు చేసి చరిత్రలో నిలిచిపోయారని ఆయన చెప్పారు. ఎన్.టి.ఆర్. అమలు చేసిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. కె.అరుణకుమారి, దేశం నాయకులు శెట్టి బాబురావు, అప్పాలు, రమేష్, అప్పలరాజు, రాజ్‌కుమార్, బి.బి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరించుకోవాలి
అరకులోయ, జనవరి 18: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పాచిపెంట శాంతకుమారి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు, బొండాం గ్రామాలలో శుక్రవారం ఆమె పర్యటించి ఇంటింట ప్రచారం చేపడుతూ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు ఎన్నో సమస్యలతో సతమతవౌతున్నా ప్రభుత్వం వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గిరిజనాభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా గ్రామాలలో కనీస సౌకర్యాలు కానరావడం లేదని ఆమె చెప్పారు. గ్రామాలలో వ్యాధులు ప్రబలుతుండడానికి నీటి సమస్యే కారణమని ఆమె అన్నారు. అనేక గ్రామాలలో రక్షిత నీరు లేక గిరిజనులు కలుషిత నీటిని వినియోగిస్తూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆమె చెప్పారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా లేదని, నిర్మించిన రోడ్లు కూడా నాణ్యత లేక అధ్వాన్నంగా మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ను ఆదరించాలని, తమ పార్టీతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమని శాంతకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాడేరులో ఎన్.టి.ఆర్. వర్థంతి
పాడేరు, జనవరి 18: దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు 23వ వర్థంతిని పాడేరులో శుక్రవారం నిర్వహించారు. స్థానిక స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఎన్.టి.ఆర్. విగ్రహానికి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, దేశం నాయకులు విజయరాణి, కొట్టగుళ్లి సుబ్బారావు, గంటా నళిని కృష్ణ, అల్లంగి సుబ్బలక్ష్మి, బొజ్జమ్మ, కొండలరావు, చీకటి మధు, శ్రీను, రమణబాబు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

మాడుగులలో ఎన్.టి.ఆర్. వర్థంతి
మాడుగుల, జనవరి 18: బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మండలంలోని ఎం.కోడూరు, కె.జె.పురం, మాడుగులలో ఎన్.టి.ఆర్. వర్థంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. మాడుగుల, ఎం.కోడూరులోని ఎన్.టి.ఆర్. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి దేశం పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. ఎన్.టి.ఆర్. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి ఉన్నకాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసారని, ఫించను విధానాన్ని తీసుకువచ్చింది ఆయనేనని అన్నారు. ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. ఓండ్రు గంగమ్మ, వైస్ ఎం.పి.పి. పెరుమాళ్ల వెంకటరావు, దేశం నాయకులు నందారపు సన్యాసిరావు, రామారావు, అద్దెపల్లి జగ్గారావు, పుప్పాల అప్పలరాజు, ఉండూరు దేముడు, శ్రీనాధు మధు, గండి శ్రీను, దాడి గణేష్, విశ్వనాధం, ఎన్.పానాపతి, కె.నాగమణి, ఎ.శివకుమార్, వేగి గాంధీ, రాము, టి.రామకొండ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహం ధ్వంసంపై సమావేశం
మాడుగుల, జనవరి 18: మండలంలోని వీరవెల్లి అగ్రహారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై గ్రామ దళిత సంఘం నాయకులతో అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై దళిత సంఘాలు ఆందోళనలు చేయడంతో అధికారులు స్పందించి వారితో చర్చించి విగ్రహ పునర్నిర్మాణంపై సమాలోచనలు చేసారు. స్థానిక తాహశీల్ధార్ ఎల్.రామారావు, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహాన్ని ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దళిత సంఘాల నాయకులు కోరారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి. నాయకులు బి.క్రిష్ణ, బేతాళ రాజారావు, కరణం తిరుపతిరావు, ఆరిపాక గాలిరాజు, భాస్కర్, మాలమహానాడు నాయకులు వి.ఎస్.చలం, మరువాడ ఈశ్వరరావు, కె.సాయి సుందరరావు, కె.్భవాని తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
కోటవురట్ల, జనవరి 18: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని వైసీపీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు డీవీ ఎస్ రాజు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న డీవీ ఎస్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. చంద్రబాబు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతున్నారో తెలియజేసేందుకు ఈనెల 25 నుంచి మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈపాదయాత్రలో శివారు గ్రామాలతో సహా అన్ని గ్రామాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీపై దేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మండల పార్టీ కన్వీనర్ పైల రమేష్ అధ్యక్షత వహించిన ఈసమావేశంలో దత్తుడు సీతబాబు, రాజులనాయుడు, కిల్లాడ శ్రీనివాసరావు, అప్పలసత్యనారాయణ, కుమార్‌రాజా రమణమూర్తి, చామంతుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
కోటవురట్ల, జనవరి 18: తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వర్గీయ ఎన్టీ ఆర్‌కే దక్కుతుందని మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు తెలిపారు. ఎన్టీ ఆర్ వర్ధంతిని మండలంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జల్లూరులో కాశీనాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈసందర్భంగా కాశీనాయుడు మాట్లాడుతూ ఎన్టీ ఆర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానీయుడు అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్టీ ఆర్ పని చేసారన్నారు. ఎన్టీ ఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో దేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు పి. రాంబాబు, జీరెడ్డి నానిబాబు, సుంకర బాబ్జి, చిటికెల సత్యనారాయణ, పినపాత్రుని బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ చిరస్మరణీయుడు
కొయ్యూరు,జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిరస్మరణీయుడని టీడీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ఎస్‌వీ ప్రసాద్ , ఎంపీపీ సత్యనారాయణ,జెడ్పీటీసీ శ్రీరామ్మూర్తిలు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రామ్మూర్తి అధ్యక్షతన మండల కేంద్రంలో ఎన్టీ ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించి జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీ ఆర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. తెలుగుజాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన వ్యక్తి ఆయన అన్నారు. పేద ప్రజల అభివృద్దికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని , పేదలకు పక్కా గృహాలు మంజూరు ఘనత ఆయనదేనని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం పలువురు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ బకీర్ ఖాన్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వరహాలబాబు, తెలుగుయువత నేత చిరంజీవి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

సమగ్ర యాజమాన్యంతో నాణ్యమైన దిగుబడులు
కొయ్యూరు, జనవరి 18 : సమగ్ర యాజమాన్యం పద్దతుల ద్వారా పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్తవ్రేత్త డాక్టర్ మాలతీ పేర్కొన్నారు. పీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని రొంగలి కొత్తూరు గ్రామంలో పప్పు ధాన్యాలు, మరియు నూనె గింజల ప్రదర్శన క్షేత్రాలను సందర్శించారు. ఈసందర్భంగా రైతాంగానికి పలు సలహాలు, సూచనలు చేసారు. మినుము రకం టీబీజీ 104 రకం మంచి దిగబడులు ఇస్తుందని, వేరుశెనగలో కె9 రకం రైతులు అధిక ఆదాయం, దిగుబడి పొందవచ్చని సూచించారు . వేరుశెనగ విత్తనాలు నాటడం, విత్తన శుద్ది, మేలైన యాజమాన్య పద్దతుల ద్వారా అధిక దిగుబడులను తీయవచ్చని సూచించారు. ఈరకాలను జాగ్రత్త పరుచుకుని రైతులకు అందేలా కృషి చేయాలని అభ్యుదయ రైతులకు సూచించారు. శాస్తవ్రేత్తలతో పాటు పీటీజీ కృషి విజ్ఞాన కేం6దం శాస్తవ్రేత్త డాక్టర్ శైలజ, సేద్య శాస్తవ్రేత్త డాక్టర్ వి. ప్రసాదరావు, సస్యరక్షణ శాస్తవ్రేత్తలు బి. నాగేంద్ర ప్రసాద్, పలువురు రైతులు పాల్గొన్నారు.
కృష్ణాదేవిపేటలో ఎన్టీ ఆర్ వర్ధంతి
కృష్ణాదేవిపేట, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 23వ వర్ధంతి వేడుకలు మండలంలో పలు గ్రామాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈమేరకు గురువారం పాతకృష్ణాదేవిపేటలో దేశం పార్టీ అధ్యక్షుడు బీవీ రమణ, పందిరి రమణ ఆధ్వర్యంలో ఎన్టీ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళులర్పించారు. వర్ధంతి సందర్భంగా 50 మంది వృద్ధులకు పాలు, పండ్లు రొట్టెలు అందించారు. ఎ ఎల్ పురం గొల్లవీధిలో పార్టీ నాయకులు ధనాజీ, జమీలు, నారాయణమూర్తినాయుడు, దాడి అప్పలనాయుడు, జెడ్పీటీసీ వేణుగోపాల్ తదితరులు ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. నాగాపురం, చోద్యం గ్రామల్లో ఎన్టీ వర్ధంతి నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం.బుజ్జి, జి. అప్పారావు,వాసు, పి.పాపారావు, పి.నారాయణమూర్తి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
-
తెలుగుజాతి సత్తా చాటిన దివంగత ఎన్టీఆర్
ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి వేడుకలు
ఎంపి, ఎమ్మెల్యేలు
అనకాపల్లిటౌన్, జనవరి 18: ప్రపంచ దేశంలో తెలుగుజాతి సత్తాచాటిన ఏకైక నాయుకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొనియాడారు. దివంగత ఎన్టీఆర్ 23వ వర్ధంతి వేడుకలు శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఘనంగా నిర్వహించారు.పట్టణ దేశం అధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లోముఖ్య అతిధిలుగా విచ్చేసిన ఎంపి ఆవంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్ధాపించిన తొమ్మిది నేలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలప్రజలకు తెలుగువారి ముద్దుబిడ్డగా ప్రజలు గుండెల్లో స్థిరస్థానంగా నిలిచిన వ్యక్తి అన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు సినీ రంగంలో ఆయన అనేక పాత్రలు నడించి తెలుగుజాతి అభిమాన నటుడుగా నిలిచారన్నారు.రాజకీయ రంగంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా కిలో బియ్యం రెండురూపాయలకు అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సిఎం చంద్రబాబు నడుచుకుంటూ ఎన్టీఆర్ పేరుమీద అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ పేదప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు.ఎన్టీఆర్ బరోసా పథకం ద్వారా అందజేస్తున్న పించన్లు రెండువందలు నుంచి రెండువేలుకు పెంచి ఇంటికి పెద్దకొడుకుగా ప్రజలుమన్ననలు పొందుతున్న ఏకైక వ్యక్తి సిఎం చచంద్రబాబు అన్ని అన్నారు. ముందుగా అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేశం జిల్లాప్రధాన కార్యదర్శి బుద్దనాగజగదీష్, అర్బన్ ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర, కొణతాల వెంకట్రావు, డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, కొణతాల శ్రీనివాసరావు,కొణతాల రత్నకుమారి, గుప్తాప్రభాకర్ చౌదిరి, పలకా సత్యనారాయణ పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అబిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పేదలకు దుప్పట్లు పంపిణీ
అనకాపల్లిటౌన్, జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు23వ వర్ధంతి సందర్బంగాప్రముఖ వైద్యులు దేశం నాయుకులు కాండ్రేగుల సత్యవతి అధ్వర్యంలో ఆటో డ్రైవర్లుకు ప్రధమ చికిత్స మందుల కిట్లును, రిక్షాకార్మికులకు దుప్పట్లు, పండ్లును పంపిణీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆమె సొంత నిధులుగా వీటిని పంపిణీ చేసారు. సుమారుగా వందమందికి వీటిని అందజేసారు. ఈ కార్యక్రమంలో దేశం నాయుకులు గుప్తాప్రభాకర్‌చౌదిరి, పలకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మామిడిపాలెంలో పోలీసులకు గ్రామస్తుల మధ్య వార్
పోలీస్ జీపు ద్వంసం
గ్రామంలో 144సెక్షన్
అనకాపల్లి, జనవరి 18: జాతరలో అశ్లీల నృత్యాలు తగదని అభ్యంతరం తెలిపిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై గ్రామస్తులు ముప్పేట దాడికి దిగారు. దీంతో ఆగ్రహంచిన పోలీసులు లాఠీలు జూలిపించారు. మరింత రెచ్చిపోయిన ప్రజలు పోలీస్ జీపును ద్వంసం చేసారు. మండలంలోని మామిడిపాలెం గ్రామంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి మండల దేశంపార్టీ నాయకులు కరణం శ్రీనుతోపాటు మరో 14మందిపై పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసుల కధనం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా రాములవారి తీర్ధాన్ని గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో భాగంగా డాన్స్‌బేబిడాన్స్ పేరిట అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని అదే గ్రామానికి చెందిన కొంతమంది రూరల్ ఎస్‌పి అట్టాడ బాపూజీకి ఫిర్యాదు చేసారు. దీంతో రూరల్ ఎస్.ఐ ఆదినారాయణరెడ్డి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రదర్శనలు జరుగుతుండగా రూరల్ ఎస్.ఐ ఆదినారాయణరెడ్డి అడ్డుకున్నారు. దీంతో జాతర తిలకిస్తున్న యువకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో రెచ్చిపోయిన ఎస్.ఐ లైటింగ్‌ను చితకకొట్టి అక్కడవారిని పరోక్షంగా బెదిరించే చర్యలకు ఎస్.ఐ శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య నెలకొన్న వాగ్వివాదం ముదిరి పాకానపడింది. మండల దేశం నాయకులు కరణం శ్రీను(చెక్కలశ్రీను)ను జీపుఎక్కమని ఎస్.ఐ ఫిల్టీపట్టుకుని ఎక్కించే ప్రయత్నం చేసారు. సంబంధిత శ్రీను పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహవేషాలు ఎక్కువ అయ్యాయి. ఎస్.ఐతోపాటు ఇతర పోలీస్‌సిబ్బందిపై దాడికి సన్నద్దమయ్యారు. పోలీస్ జీపును స్థానికులు ద్వంసం చేసారు. అనుమతులు తీసుకోకుండా డాన్స్‌లు ఎలా వేస్తున్నారని ఎస్.ఐ నిలదీయగా, అసలు ఇక్కడ డాన్స్‌ర్లే లేరని అక్కడ ఉన్నవారు ఎస్‌ఐకి దురుసుగా సమాధానం చెప్పడంపై ఈ సంఘటన చోటుచేసుకుంది. పోగ్రంను సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని గ్రామస్తులు అంటుండగా తాము ఎటువంటి పరిమిషన్ ఇవ్వలేదని రూరల్ సి.ఐ రామచంద్రరావు అంటున్నారు. రూరల్ సి.ఐ రామచంద్రరావు ఇతర పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి శుక్రవారం వెళ్లి విచారించారు. ఈ సందర్భంగా సి.ఐ రామచంద్రరావుమాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, గ్రామంలో 144 సెక్షన్ విధించామన్నారు.

కశింకోట టీడీపీ అధ్యక్షుడిగా తాకాశి
కశింకోట, జనవరి 18: మేజర్‌పంచాయతీ కశింకోట గ్రామ అధ్యక్షుడిగా తాకాశి కృష్ణ, కార్యదర్శిగా పెంటకోట సత్యనారాయణను నియమిస్తున్నట్లు పార్లమెంట్‌సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రకటించారు. స్థానిక విలేఖర్లతో శుక్రవారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ గ్రామంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీరికి బాధ్యత అప్పగిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షకార్యదర్శులు కృష్ణ, సత్యనారాయణలు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతను తూచాతప్పకుండా నెరవేరుస్తామని, వచ్చే ఎన్నికల్లో దేశంపార్టీ జెండాను ఎగరవేసేందుకు తమవంతుకృషి చేస్తామన్నారు. వీరి ఎన్నికపట్ల ఆర్‌ఇసిఎస్ చైర్మన్ మలసాల రమణారావు, అనకాపల్లి మార్కెట్‌కమిటిచైర్మన్ కాయల మురళీధర్, జడ్‌పిటిసి మలసాల ధనమ్మ, ఎంపిపి పంచదార్ల లక్ష్మీ, మాజీ ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ, మాజీ వైస్‌ఎంపిపి వేగి గోపికృష్ణ, దేశం నాయకులు వేగి వెంకట్రావు, వేగి రామరాజు, ఆడారి నరశింగరావు, రవ్వా మల్లేష్, పెంటకోట రాము,పంచదార్ల సూరిబాబు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
ఆహ్లాదకర వాతావరణంలో బెలూన్ ఫెస్టివల్
అరకులోయ, జనవరి 18: ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ హట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ, గిరిజన మంత్రి శ్రావణ్‌కుమార్ తెలిపారు. అరకులోయలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన మంత్రులు మండలంలోని మాడగడ పంచాయతీ దళపతిగుడ, బురిడిగుడ గ్రామ సమీపంలో అతిధులు, విదేశీయులకు ఏర్పాటు చేసిన గుడారాలను సందర్శించారు. పదిహేను దేశాలకు చెందిన ఔత్సాహికులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు, బందోబస్తును వారు పరిశీలించారు. స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ వేడుకలో పాల్గొని బెలూన్లలో విహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ప్రాంతంలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా విదేశాలకు చెందిన రకరకాల బెలూన్లను విహంగ విహారం చేయిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ ప్రాంతంలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడం రెండో సారని, ఈ సారి జరుగుతున్న జరుగుతున్న ఫెస్టివల్ అందరి సహకారంతో విజయవంతం కానున్నదని వారు అన్నారు. బెలూన్ ఫెస్టివల్ నిర్వహణకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ బెలూన్లలో ప్రయాణించేందుకు పర్యాటకులు, వీక్షకులు పోటీ పడుతున్నట్టు అఖిల ప్రియ, శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సమస్యలపై ఆరా
అరకులోయ, జనవరి 18: మండలంలోని సుంకరమెట్ట సమీపంలో గల కొర్రాగుడ గ్రామంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎం.పి. విజయసాయిరెడ్డి శుక్రవారం పర్యటించారు. నియోజకవర్గం వైసీపీ నాయకుల అభ్యర్థన మేరకు ఆయన కొర్రాగుడ గ్రామాన్ని సందర్శించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నార