విశాఖపట్నం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21:జిల్లా కలెక్టర్‌గా కాటంనేని భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా ఇప్పటి వరకూ పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు, అక్కడ పనిచేస్తున్న భాస్కర్‌ను విశాఖకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విధితమే. కలెక్టరేట్‌లో ప్రవీణ్‌కుమార్ నుంచి బాధ్యతలు చేపట్టిన అనంతరం భాస్కర్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే తన అజెండాగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలు నూరు శాతం పరిష్కరించాలన్నదే తన లక్ష్యమని, అయితే వ్యక్తిగత, కుటుంబ, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో ఇది సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులకు అందేలా చూడటంతో పాటు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగాన్ని సమన్యయం చేసుకుంటూ పనిచేస్తానని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అమలవుతున్న ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు యధావిధిగా అమలవుతాయన్నారు. స్థానిక అంశాలు, పరిస్థితులను ఆకళింపు చేసుకుని పాలనా పరంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పలువురు కలెక్టర్ భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.