విశాఖపట్నం

సరికొత్త పంథా..తనదైన శైలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాటంనేని భాస్కర్ సరికొత్త పంథాను అనుసరించారు. తనదైన శైలిలో అధికారులను ప్రశ్నిస్తూ దడపుట్టించారు. ఇప్పటి వరకూ కలెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ నుంచి సోమవారం బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనంతరం డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తమ సమస్యలు చెప్పుకుని వినతులు అందించేందుకు వచ్చిన ఫిర్యాదు దారులతో మమేకమయ్యారు. వారి సమస్యలను స్వయంగా పరిశీలిస్తూనే పరిష్కారానికి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే వివరణ కోరారు. తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను పదేపదే తిప్పడం సరైన పద్ధతి కాదని, వారి వినతులు పరిష్కార యోగ్యమో కాదో చేప్పాలని సూచించారు. ప్రజావాణికి హాజరై తాను పరిశీలించిన 20 ఫిర్యాదుల్లో 10 ఫిర్యాదులు సామాజిక పింఛన్లకు సంబంధించినవేనని, మండల స్థాయిలో పరిష్కారమ్యే సమస్యలు కూడా జిల్లా కేంద్రానికి ఎందుకు వస్తున్నాయంటూ అధికారులను నిలదీశారు. మండల స్థాయిలోనే పింఛను దరఖాస్తులు తీసుకుని, అర్హుల జాబితాలను జిల్లా కేంద్రాలకు పంపాల్సిన ఎంపీడీఓలు చేస్తున్నదేమిటంటూ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో పింఛను దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల స్థితిని తెలుపుతూ ప్రకటించిన 22ఎ జాబితాలో ప్రైవేటు భూములు చోటుచేసుకోవడంపై వచ్చిన పలు ఫిర్యాదులపై కలెక్టర్ భాస్కర్ స్పందించారు. రెవెన్యూ, సర్వే విభాగాలు సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో మండల తహశీల్దార్లు ప్రభుత్వ భూములకు సంబంధించి క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి, ఇస్తున్నట్టు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 22ఎ జాబితాలో చేరిన భ భూములకు సంబంధించి ప్రతి వారం సంబంధిత కమిటీ సమావేశమై వచ్చిన దరఖాస్తులు, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూనే, త్వరలోనే కమిటీతో తాను సమావేశమై సమీక్షిస్తానన్నారు. నగర పరిధితో పాటు మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను ఎవరికీ ధారాదత్తం చేయవద్దంటూ హుకుం జారీ చేశారు. ప్రభుత్వ అవసరాలకు సైతం భూములు కొనుగోలు చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయని, భూ పందేరాలు నిలిపివేయాలని ఆదేశించారు.
ప్రజావాణిలో భాగంగా ఆర్‌డబ్ల్యుఎస్‌పై వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ తాను చిన్నవాడినని, తన ముందు నటించే ప్రయత్నం చేయవద్దంటూ సున్నితంగా మందలించారు. అలాగే మూగ, చెముడు మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా, సాధికార సర్వే వివరాలు వేరే ప్రాంతంలో నమోదై ఉన్నందున తిరస్కరించినట్టు వికాలాంగుల సంక్షేమ అధికారులు తిరస్కరించడంపై కలెక్టర్ మండిపడ్డారు. చేయాల్సిన పని నుంచి తప్పించుకునేందుకు కొత్త నిబంధనలను తెరపైకి తీసుకురావద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వ్యక్తి వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ సంబంధిత వ్యక్తికి వృద్ధాప్య లేదా చేనేత కార్మికుని కోటాలో పింఛను మంజూరు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజావాణికి హాజరైన పలువురు గతంలో చాలాసార్లు వినతులు ఇచ్చినా స్పందించలేదంటూ చెప్పగా కలెక్టర్ తీవ్రంగానే స్పందించారు. ప్రజలను పదేపదే తిప్పించుకునే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు. అంతకు ముందు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో కూడా కలెక్టర్ భాస్కర్ తన మార్కు ప్రదర్శించారు. ప్రజావాణికి హాజరైన కలెక్టర్‌పై గౌరవసూచకంగా అధికారులు లేచి నిలబడగా, వద్దని వారిస్తూ ఇటువంటి ఫార్మాలిటీస్ తనకు అవసరం లేదంటూ సున్నింతంగా తిరస్కరించారు. సమావేశ మందిరంలో ప్రజావాణికి హాజరైన జిల్లా అధికారుల పేరు, హోదా తెలిపే బోర్డులు ఏర్పాటు చేయించారు.