విశాఖపట్నం

ఫార్మాసిటీలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, మే 24: జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల శ్రీకర్ లేబరేటరీస్‌లో మంగళవారం జరిగిన పేలుడు ప్రమాదంలో గాయపడి గాజువాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరామర్శించారు. పరవాడ వద్ద గల జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల శ్రీకర్ ఔషధ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరో 21 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు ముగ్గురు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నంలో గల రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాజువాకలోని ఆసుపత్రుల్లో సుమారు 18 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఆమోనియా సిలిండర్ సేఫ్టీ వాల్వ్ పేలుడు కారణంగా ఆ సంస్థ యుటిలిటీ బ్లాక్‌కు చెందిన గోడలు కూలిపోయాయి. దీంతో కొంత మంది కార్మికులు గాయపడగా, ఆమోనియా గ్యాస్ లీక్ కారణంగా మరికొంత మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు ఎంపిపి మాకవరపు అప్పలనాయుడు, టిడిపి మండల నాయకుడు పైలా సన్యాసిరాజు, కల్లూరి వెంకటరమణ, పెందుర్తి టిడిపి ఇన్‌ఛార్జి బండారు అప్పలనాయుడు, నాయకులు వర్రి పరదేశినాయుడు క్షతగాత్రులను పరామర్శించారు.
మాడి మసైన పచ్చని చెట్లు!
పేలుడు కారణంగా లీక్ అయిన ఆమోనియా గ్యాస్ ప్రభావానికి సంఘటన స్థలానికి 40 మీటర్ల దూరంలో ఉన్న పచ్చని చెట్లు నల్లగా మాడి పోయాయి. పరవాడ వద్ద నిర్మించిన ఫార్మాసిటీలో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్న విషయం విదితమే. ప్రమాదాల కారణంగా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు ప్రమాదాన్ని పక్కనే పెట్టుకుని నిద్ర పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు, అగ్ని ప్రమాదాలు భయటికి కనిపించేవి. అయితే ఔషధ కంపెనీలో ప్రమాదకర విష వాయువులు ఉంటాయని, అవి ఏ సందర్భంలోనైనా లీక్ అయితే పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులతో పాటు పరిసర గ్రామాల ప్రజల పరిస్థితి ఏమటని ప్రశ్నించేందుకు మంగళవారం శ్రీకర్ లేబరోటరీస్‌లో జరిగిన ప్రమాదమే నిదర్శనమని అంటున్నారు. శ్రీకర్ ఔషధ కంపెనీలో అమోనియా గ్యాస్ సిలిండర్ స్టేప్టీ వాల్వ్ పేలడం కారణంగా ప్రమాదకర ఆమోనియా గ్యాస్ లీక్ అయింది. దీని కారణంగా పరిసర ప్రాంతంలో ఉన్న కార్మికులంతా స్పృహ కోల్పోయారు. దీనికి తోడు సంఘటనా స్థలానికి సుమారు 40 మీటర్ల దూరంలో ఉన్న పచ్చని మొక్కలు నల్లగా మాడి పోయాయి. లీక్ అయిన ఆమోనియా గ్యాస్ ప్రభావం ఎంత మేర ఉంటుందో శ్రీకర్ కంపెనీలో నల్లగా మాడిన మొక్కలను చూస్తే అర్థం అవుతుందని సంఘటనా స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.