విశాఖపట్నం

గీతం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో భద్రత వారోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: రవాణాశాఖ, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో 30వ రహదారి భద్రత వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రహదారి భద్రతపై యువత వాహన చోదనపై అవగాహన పెంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వినియోగం వంటి భద్రత ప్రమాణాలు పాటించడం అలవరచుకోవాలన్నారు. రహదారి ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న ప్రతి 100 మందిలో 29 మంది ద్విచక్ర వాహనచోదకులేనన్నారు. యువత తమ విలువైన ప్రాణాలను రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ మాట్లాడుతూ రహదారి భద్రత విషయంలో చదువుకున్న యువత సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం కొనసాగించాలని హితవు పలికారు. కార్యక్రమంలో అనకాపల్లి రవాణాశాఖ అధికారి ఎహెచ్ ఖాన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రోఫెసర్ జీవీ స్వామి, గీతం ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ కే లక్ష్మిప్రసాద్, ఎం శరత్ చంద్రబాబు, పీ షీల, ఎస్ గణపతి తదితరులు పాల్గొన్నారు.