విశాఖపట్నం

నేటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 10వ తేదీ సాయంత్రం లోగా తమ దరఖాస్తులు అందజేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ స్థానానికి రూ.2000, పార్లమెంట్ స్థానానికి రూ.5000 చెల్లించి దరఖాస్తులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాలకు వేర్వేరుగా దరఖాస్తులు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుందని, పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విస్తృతంగా ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం వ్యక్తం అవుతోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, కాంగ్రెస్ నాయకుడు కే గోపాల్‌రెడ్డి, గంప గోవింద్ తదితరులు పాల్గొన్నారు.