విశాఖ

ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికత, సేవా భావం కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 14: సమాజంలో ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికత, సేవా భావం కలిగి ఉన్న నాడే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని సత్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.చలం అన్నారు. పాతకృష్ణాదేవిపేటలో నూతనంగా నిర్మించిన సత్యసాయిబాబా మందిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మందిరంలో సాయి భజనలతో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చలం మాట్లాడుతూ నిత్య జీవనంలో భగవంతునిపై భక్తి కలిగి ఉండి ఆధ్యాత్మికంగా మారి సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. భక్తి భావనలు , కీర్తనలు, భజనలతో భగవంతుడిని ఆరాధించాలన్నారు. ఎన్నో కోట్ల మందికి భగవాన్ సత్యసాయి సేవలందించారన్నారు. జిల్లా సత్యసాయి అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచి మార్పునకు దైవారాధన ఎంతో అవసరమన్నారు. మనలో మానవత్వం గుర్తెరిగిననాడు భగవంతుని కృపకు పాత్రులు కాగలమన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి అయ్యన్న తనయుడు రాజేష్, ఎ ఎంసీ చైర్మెన్ అప్పలనాయుడు, జెడ్పీటీ సీ వేణుగోపాల్‌తో పాటు సాయి ఆధ్యాత్మిక గురువు శంకరస్వామి, శ్రీనివాసరావు, రాజా అమ్మాజీ , ప్రసాద్,రమణ, త్రినాధ్, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ బూత్‌లు వౌళిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు
కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 14: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలో అన్ని పోలింగ్ బూత్‌ల్లోనూ వౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ చెలమయ్య తెలిపారు. ఎ ఎల్ పురంలోని ఆరు పోలింగ్ బూత్‌లను ఆయన తనిఖీ చేసారు. బూత్‌లను తనిఖీ చేసి టాయిలెట్, ఇతర సౌకర్యాలు లేకుంటే ప్రతిపాదనలు తయారు చేసారు. పాతూరు, నాగాపురం, కొంకశింగి తదితర పంచాయతీల్లో పోలింగ్ బూత్‌లను పరిశీంచారు. నెలాఖరులోగా అన్ని ప్రతిపాదనలతో సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ బూత్‌ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్ ఐ గోవిందరావు, వీ ఆర్ ఓ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన గోవిందరావు
నర్సీపట్నం, ఫిబ్రవరి 14: రెవెన్యూ డివిజనల్ అధికారిగా రోణంకి గోవిందరావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్డీవోగా కొనసాగిన వి . విశే్వశ్వరరావును విజయనగరం జిల్లా ఐటీడీ ఎ అసిస్టెంట్ పీ ఓ , కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎపీ ఐ ఐసీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోవిందరావును నియమితులయ్యారు. ఈమేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన గోవిందరావు మొదటిగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవోగా, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, విశాఖ జిల్లాలో భూ సేకరణకు డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు . అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా పని చేసిన అనుభవం తనకు ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలను అనుసరిస్తూ ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.