విశాఖపట్నం

గిరిజన ఆర్ధికాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: గిరిజనఆర్ధికాభివృద్ధే లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాథమిక ఆరోగ్యశాఖామంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు రూ.15వేలు ఆదాయం సమకూరేలా మెగా గ్రౌండింగ్ మేళాల ద్వారా లబ్ధిదారులకు ఉపకరణాలు మంజూరు చేస్తున్నామన్నారు. గురువారం లాసన్స్‌బే కాలనీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ట్రైకార్ పథకం కింద 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 28 మంది లబ్ధిదారులకు పది ఇన్నోవా వాహనాలు, 18 బొలేరో వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైకార్ పథకంలో రూ.3.45 కోట్ల రుణాలతో వాహనాలు పంపిణీ చేశామన్నారు. కోటి 25 లక్షలు రాయితీ మంజూరు చేయడం జరిగిందన్నారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో సిఎం చేతులమీదుగా 51 వాహనాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. 1100 ఉపాధ్యాయ పోస్టులు, 1900 ఎఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. గిరిజనుల జీవనోపాధి పెంచడానికి ట్రైకార్ రుణాలు అందిస్తున్నామన్నారు. అరకువేలీ, లంబసింగిలో పర్యాటకులకు వినియోగించుకోవడానికి వాహనాలు ఉపయోగపడతాయన్నారు. వీటి ద్వారా లబ్ధిదారులకు ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రతి గిరిజనుడికి నెలకు కనీసం పది వేలు ఆదాయం సమకూరేలా పథకాలు అందించాలని సిఎం నిర్ణయం తీసుకున్నారని గిరిజనుల తరపున సిఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి విఎస్ ప్రభభాకరరావు, పెదబయలు ఎంపీపీ ఉమామహేశ్వరరావు, ట్రైకార్ ఇన్‌చార్జి ఎన్.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.