విశాఖపట్నం

అనకాపల్లి అభివృద్ధికి ఎంతో చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్ల కాలంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే పీలా గోవింద్ స్పష్టం చేశారు. నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి దివంగత పీలా మహాలక్ష్మి నాయుడు హయాం నుంచి తమ కుటుంబం టీడీపీలోనే కొనసాగుతోందన్నారు. పార్టీకి తన కుటుంబం అందించిన సేవలకు గుర్తింపుగానే 2014లో తనకు అనకాపల్లి నుంచి పోటీకి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానన్నారు. తన హయాంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని తెరిపించడం గొప్ప విజయంగా పేర్కొన్నారు. రూ.31.58కోట్లతో కర్మాగారాన్ని ఆధునీకరించడంతో పాటు రైతుల, ఉద్యోగుల, ప్రభుత్వ బకాయిలు తీర్చనున్నట్టు వెల్లడించారు. తన హయాంలోనే కర్మాగారం తిరిగి తెరుచుకోవాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ 18వేల టన్నుల చెరకు ఆడించామని, మరో 10వేల టన్నులు ఆడనున్నట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నియోజకవర్గంలో 18వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఏ ఏడాది ఆగస్టు నాటికి అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. జమ్మాదుల పాలెం, నర్సాపురం ఆనకట్టల నిర్మాణంతో రైతులకు లబ్దిచేకూరనుందన్నారు. రూ.160 కోట్లతో ఉపాధిహామీ పనులు, రూ.180 కోట్లతో ఆర్ అండ్ బీ రహదార్లు అభివృద్ధి పరిచానన్నారు.
పార్టీ వీడే ప్రసక్తే లేదు
టీడీపీని వీడుతానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని పీలా స్పష్టం చేశారు. తమ కుంటుంబం యావత్తు టీడీపీకే అంకితమన్నారు. తాను ఊపిరి ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతానన్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడంపై మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే ఆయన పార్టీ మారినట్టు పేర్కొన్నారు.