విశాఖపట్నం

ప్రజల మధ్యే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలంటే యువత ప్రజలతో మమేకమై ఉండాలని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. విశాఖ రూరల్, అర్బన్ జిల్లాల తెలుగు యువత కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షత, దూరదృష్టి రాష్ట్రాన్ని అగ్రపథంలో నడుపుతోందన్నారు. పింఛన్లు, గృహనిర్మాణం, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, వంటి పథకాలు టీడీపీ ప్రభుత్వం మాత్రమే కొనసాగించగలదని ప్రజలకు వివరించాలన్నారు. ఈ పథకాలు నిరంతరం కొనసాగుతూ, రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో యువ కార్యకర్తలు వివరించాలని సూచించారు. కేంద్రం అన్యాయం చేస్తున్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. విపక్ష నేత జగన్ అధికార కాంక్షతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అటువంటి నాయకుల చేతికి అధికారం వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కేవలం అలంకారమేనని, ప్రజలకు మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవసరమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తే చాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల ముందు పార్టీలు మారుతున్న నాయకులు టీడీపీపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్నంత కాలం కనిపించని తప్పులు ఇప్పుడు కన్పిస్తున్నాయని ప్రశ్నించారు. అటువంటి జంప్ జిలానీలకు కార్యకర్తలే సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ లీడర్ ఆధారంగా ఎదగలేదని, కేడర్ ఆధారంగా అగ్రపథాన నడుస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీ భరత్ మాట్లాడుతూ మంచి ఆలోచన, దూరదృష్టి, సేవా నిరతి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయం ద్వారానే వ్యవస్థలో మార్పు తీసుకురాగలమన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగాలంటే టీడీపీ గెలుపొందాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. సమావేశానికి తెలుగు యువత నగర అధ్యక్షుడు లొడగల కృష్ణ అధ్యక్షత వహించగా, పెందుర్తి ఇన్‌ఛార్జి బండారు అప్పలనాయుడు, రూరల్ జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము, అర్బన్ ఉపాధ్యక్షుడు జోగ ముత్యాలు, శివేరి అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ను ఘనంగా సత్కరించారు.