విశాఖ

కాంగ్రెస్ అధికారంతోనే ఏపికి ప్రత్యేకహోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిఫిబ్రవరి 20: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేకహోదా సాధ్యపడుతుందని అనకాపల్లి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఐఆర్ గంగాధర్ స్పష్టం చేసారు. ప్రత్యేకహోదా బరోసాయాత్రను పట్టణంలోని భీముని గుమ్మ, కొట్నివీధి, రైల్వేస్టేషన్ మీదుగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ ప్రధాని కాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇట్టే అమల్లోకి వస్తుందన్నారు. ఈనెల 22న తిరుపతిలో జరిగే బహిరంగసభలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. ప్రతీ రైతుకు రెండు లక్షలు రుణమాఫీ,ఉచిత గ్యాస్, డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ తదితర ఎన్నో పథకాలు అమల్లోకి వస్తాయన్నారు.ఈ పాదయాత్రలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు టి రమణ, పార్టీ మండల పార్టీకార్యదర్శి ఎ బాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్ధుల కొవ్వొత్తుల ర్యాలీ
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 20: భారత జవాన్లపై కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరనసనగాను, ఈ సంఘటనలో అమరజీవులైన జవాన్లకు శ్రద్దాంజలి ఘటిస్తూ బుధవారం రాత్రి మండల్‌లోని విజయరామరాజుపేట గ్రామంలో విద్యార్ధులు కొవ్వొత్లు ర్యాలీ నిర్వహించారు. విజయరామరాజుపేట జిల్లా పరిషత్ ఉతన్నత పాఠశాల నుండి జరిగిన ఈ ర్యాలీ విజయరామరాజుపేట జంక్షన్ వరకు జరిగింది. అక్కడి విద్యార్ధులు మానవహారంగా ఏర్పడి పాక్ ఉగ్రవాదులు దుశ్చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ముష్కర మూకలను తుదముట్టించే వరకు విస్రమించ వద్దంటూ భారత జవాన్లకు మద్దతుగా నినాదులు చేశారు. చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పదోన్నతిపై బదిలీపై వెలుతున్న డిటికి ఘన సన్మానం
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 20: స్దానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎంవివి ప్రసాద్‌కు తహశీల్దార్‌గా పదోన్నతి కల్పించి శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. బదలీపై వెలుతున్న ప్రసాద్‌ను బుధవారం స్దానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుభాష్ బాబుతో పాటు కార్యాలయ ఉద్యోగులు, విఆర్వోలు, విఆర్‌ఎలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. తహశీల్దార్‌గా పదోన్నతి పొందిన ప్రసాద్‌ను అభినందించారు. తనకు సహకరించిన ఉద్యోగులందరికీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.