విశాఖ

గ్యాస్ పైపులైన్ ఏర్పాటుకు భూములు ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 20: గ్యాస్ పైపులైన్ ఎర్పాటుకు ఎట్టిపరిస్థితులోనూ తమ భూములు ఇచ్చేదిలేదని అనకాపల్లి ప్రాంతానికి చెందిన రైతులు తేల్చి చెప్పారు. బలవంతంగా మా భూములు తీసుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.స్థానిక గవరపాలెం రైతు భారతిలోబుధవారం గ్యాస్ పైపులైన్ ఏర్పాటులో భూములు కోల్పొయిన రైతులతో అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి దాడికి రైతులు తమ సమస్యలు ఏకరువుపెట్టారు. పట్టణ ప్రాంతమైన అనకాపల్లి భూముల్లో గ్యాస్ పైపులైన్లు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోతామన్నారు. ఇప్పటికే విద్యుత్ స్థంబాలకు, జాతీయ రహదారి విస్తరణకు, పెట్రోల్ పైపులైనుకోసం తమ భూములు సేకరించారన్నారు. ఇప్పడు గ్యాస్ పైపులైను ఏర్పాటు కోసం తమ భూములు తీసుకుంటే ఏ విధంగా బతకాలని ఆవేధన వ్యక్తం చేసారు. గ్యాస్ పైపులైను ఏర్పాటు చేస్తే పక్కన ఉన్న భూములకు కూడా నష్టం వస్తుందన్నారు. గతంలో సంబందిత అధికారులకు ఇదే విషయాన్ని స్పష్టం చేసామన్నారు. మరలా భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. భూములు వద్దకు రాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా రాహస్య సర్వే జరిపి భూములు తీసుకోవడం తగదన్నారు. దీనిపై మాజీ మంత్రి దాడి స్పందిస్తూ మీరంతా ఐక్యంగా ఉంటే న్యాయం జరుగుతుందన్నారు. తమతోపాటు వ్యవసాయ దారుల సంఘం మద్దతు కూడా అండగా ఉంటుందన్నారు.బాష తెలియని, బాధ్యత లేని అధికారులు వలనే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అవసరం అయితే కోర్టును ఆశ్రయించైనా న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయదారుల సంఘం కార్యదర్శి ఉల్లూరి రాము, ఉపాధ్యక్షులు పైడారావు, బి కృష్ణ అప్పారావు, కె పూర్ణచంద్రరావు, పి వీరునాయుడు, అనకాపల్లి, తోటాడ, సిరసపల్లి ప్రాంత రైతులు పాల్గొన్నారు.

రబీసీజన్ స్వల్పకాలిక రుణాల పంపిణీ
అనకాపల్లి ఫిబ్రవరి 20: స్థానిక గౌరీ పిఎసిఎస్‌లో స్వల్పకాలిక రబీ సీజన్ రుణాలను సొసైటీ అధ్యక్షులు కర్రి మహాలక్ష్మినాయుడు బుధవారం అందజేసారు. 31మంది సభ్యులకు 15లక్షలు రుణాలను అందజేసారు. సొసైటీ ఉపాధ్యక్షులు ఉల్లూరి ధర్మరాజు,డైరెక్టర్లు బుద్దతాతారావు, బుద్ద సత్యనారాయణ, కంటపల్లి శోభారాణి, పిల్లా వెంకటరమణ, గోవాడ కృష్ణవేణి, కె ఎశోధ తదితరులు పాల్గొన్నారు.