విశాఖ

జీసీసీ చైర్మెన్ ఎంవీవీకి అపూర్వ ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, ఫిబ్రవరి 20: గిరిజన సహకార సంస్థ నూతన చైర్మెన్ ఎంవీవీ ప్రసాద్‌కు మండల వాసులు బుధవారం అపూర్వ ఘన స్వాగతం పలికారు. చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా స్వగ్రామం వచ్చిన ఆయనకు మండల వాసులు హారతులతో బ్రహ్మరధం పట్టారు. ఎంపీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ శ్రీరామ్మూర్తి, ఎ ఎంసీ చైర్మెన్ చిట్టిబాబు, పలువురు పార్టీ నేతలతో పాటు జీసీసీ డీ ఎం పార్వతమ్మతో పాటు సిబ్బంది ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయన వెంట పాల్గొన్నారు. కృష్ణాదేవిపేట నుండి కొయ్యూరు వరకు తెలుగు తమ్ముళ్ళు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతాలమ్మ ఘాట్‌లో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రసాద్‌ను చింతలపూడిలో రైతు సంఘం నేత కనకరాజు ఆధ్వర్యంలో మహిళలు శాలువాతో సన్మానించారు. కొండగోకిరి, నడింపాలెం, కాకరపాడు, శింగవరం కాలనీల్లో మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టారు. స్థానిక వెలుగు సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథక చింతపల్లి ఎపీడీ రవీంధ్రనాధ్, జీసీసీ డీ ఎం పార్వతమ్మ, ఎంపీ డీ ఓ రెహమాన్, ఎటీడబ్ల్యు ఓ శ్రీనివాస్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు , పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ముందుగా కాకరపాడులో అల్లూరి విగ్రహానికి కొయ్యూరులో అంబేడ్కర్ విగ్రహానికి, ఎన్టీ ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించిన ప్రసాద్ వీర జవాన్ల మృతి పట్ల వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అదృష్టం ఈ రూపంలో కల్పించిన అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసారు. తన తంఢ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షునిగా ప్రకటించిన నెల రోజుల్లోనే జీసీసీ చైర్మెన్‌గా నియమించడం ఆనందంగా ఉందని ఈరెండు పదవులకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావడంతో పాటు అండగా నిలవాలన్నారు. కొయ్యూరు బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత శివాజీరాజ్‌తో పాటు మన్యం, మైదాన ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు ప్రసాద్‌ను కలిసి అభినందించారు.

పీవీటీజీల సంక్షేమ పథకాలు తెలపండి
కొయ్యూరు, ఫిబ్రవరి 20: ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వం వర్తింపు చేసే సంక్షేమ పథకాల వివరాలను తెలపాలని ప్రగతిసిరి స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధి గెడ్డం విజయలక్ష్మి ఎంపీడీ ఓ రెహమాన్‌ను కోరారు. బుధవారం ఎంపీడీ ఓను కలిసిన ఆమె మండలంలో పలు పీవీటీజీ గ్రామాల్లో తమ సంస్థ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. పీవీటీజీలకు ప్రభుత్వం అందించే రాయితీలు వర్తింపు చేసే పథకాలను తెలియజేస్తే వాటిపై వారికి అవగాహన కల్పించి పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తామని తెలుపుతూ ఎంపీడీ ఓకు వినతి పత్రం అందజేసారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
అనకాపల్లినుండి విశాఖ వరకు బస్సుపాసులు అనుమతించాలి
అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 20: అనకాపల్లి మున్సిపాల్టీని విశాఖ జివిఎంసీలో విలీనం చేసి ఐదేళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు అనకాపల్లి నుండి విశాఖ వరకు బస్సుపాసులు అనుమతించకపోవడం అన్యాయమని సీపీఐ నాయుకులు నియోజకవర్గ కన్వీనర్ రాజాన దొరబాబు ఆరోపించారు.అన్ని బస్సుపాసులు అనకాపల్లి నుండి విశాఖ వరకు వర్తింపచేయాలని కోరుతూ ఆయన బుధవారం అర్డీవో సూర్యకళకు వినతిపత్రం అందజేసారు.ఈ సందర్బంగా దొరబాబు మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ నిబంధనలు ప్రకారం అన్ని పన్నులు అనకాపల్లి పట్టణ ప్రజలు నుండి వసూలుచేసినప్పులు బస్సుపాసులు కూడా పూర్తిస్థాయిలో వర్తింపచేయాలని డిమాండ్ చేసారు. గ్రామీణ ప్రాంతాలు నుండి పేద విద్యార్ధులు, ఉపాధి కోసం విశాఖ పట్టణం ప్రయాణం చేసే పేద మధ్యతరగతి కార్మికులు వద్దనుండి పాసు కలిగి ఉండికూడా అనకాపల్లి నుండి లంకెలపాలెం వరకు ఆదనంగా టికేట్ కట్ చేయడం నిబందనలకు విరుద్దమని ఆరోపించారు. పలితంగా పేద ప్రజలపై అదనంగా భారం పడుతుందన్నారు. తక్షణమే అన్ని రకాల పాసులు అనకాపల్లి నుండి విశాఖ వరకు అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్డీవో సూర్యకళకు వినతి పత్రం అందజేసారు. ఈ విషయంపై స్పందించిన అర్డీవో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయుకులు విత్తనాల పోతురాజు, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.