విశాఖ

పాడి పరిశ్రమ అభివృద్ధికి గోకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఫిబ్రవరి 20: ప్రభుత్వం మంజూరు చేసిన గోకులాలతో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసుకోవాలని రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతులకు సూచించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 261 మినీ గోకులాల మంజూరు పత్రాలను రైతులకు అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్నకారు రైతుల ఆర్ధిక స్వావలంభనకు ఉపయోగపడే విధంగా గోకులాలను మంజూరు చేసి లక్ష నుండి లక్షా 80 వేల రూపాయల వరకు అందజేస్తున్నామన్నారు. డిసెంబర్ 5లోపున డీడీలు కట్టిన వారికి 90 శాతం సబ్సీడి , తదనంతరం డీడీలు చెల్లించిన వారికి 70 శాతం సబ్సీడి అందిస్తున్నామన్నారు. పలు కార్పొరేషన్ల ద్వారా మేలు జాతి పాడి గేదెలను సబ్సీడిపై రైతులకు అందిస్తున్నామన్నారు. పశువులకు అవసరమయ్యే గడ్డి దాణాను సబ్సీడి ధరలకే అందజేస్తున్నామని , గడ్డి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మరో 441 గోకులాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు . రాష్ట్రంలో రసాయినిక ఎరువుల వాడకం తగ్గిందన్నారు. పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో రైతులు పాడి పశువుల పెంపకాన్ని మరింత వృద్ధి చేసుకోవాలన్నారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ గణేష్ మాట్లాడుతూ గ్రామానికి సరిపోయే పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సబ్సీడిపై గడ్డి, దాణాను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఆవు, గేదె చనిపోయినట్లైతే 15 నుండి 30 వేల రూపాయల వరకు నష్టపరిహారం అందుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో గోవిందరావు, ఎంపీపీలు సుకల రమణమ్మ, సన్యాసిదేవుడు తదితరులు పాల్గొన్నారు.

* గ్రామ సమాఖ్యలకు భవనాలు
మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రతీ గ్రామంలో భవనాలను నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ భవనానికి అవసరమైన ఐదు సెంట్లు స్థలాన్ని గుర్తిస్తే వెంటనే 14 లక్షలు మంజూరు చే స్తామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే 87 భవనాలకు 12.18 లక్షలు మంజూరు చేసామన్నారు. బూరుగుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా సిబ్బందిని మంజూరు చేసామని తెలిపారు.