విశాఖ

పోలీసులు విస్తృత వాహన తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, మార్చి 14: ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు . ఎన్నికల్లో మద్యం, నగదు అక్రమంగా తరలించే పరిస్థితి ఉండడంతో ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం ఎస్సై కె.రాము ఆధ్వర్యంలో మాకవరపాలెం సమీపంలోని పెద్దమిల్లు జంక్షన్ వద్ద కొండల అగ్రహారం సర్పానది పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. నర్సీపట్నం - విశాఖ ప్రధాన రహదారిలో వెళ్ళే ప్రతీ వాహనాన్ని పోలీసులు ఆపి వాటిని నిశితంగా తనిఖీలు చేసి విడిచి పెడుతున్నారు.

రోగులకు కంటి ఆపరేషన్లు
అనకాపల్లిటౌన్, మార్చి 14: కంటి వ్యాదులతో ఇబ్బంది పడుతూ ఆర్ధికంగా ఉండి వైద్యం చేయించుకోలేని వారిని రోటరీ క్లబ్ సహయ గవర్నర్ బుద్ద రమణాజీ గుర్తించి వారిచి రోటరీ కంటి ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన ఉచిత కంటివైద్యశిబిరంలో 60మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో10మందికి బుధవారం కంటి వైద్యులు మంజుల ఆపరేషన్లు నిర్వహించారు. వారికి బుద్ద రమణాజీ ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేసారు. ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి చైర్మన్ విరవిరామ్, జోహర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధులపై రోగులకు ఆవగాహన
అనకాపల్లిటౌన్, మార్చి14: ప్రతీ ఒక్కరూ మూత్ర పిండాలు కాపాడుకొనుటకు తగిన జాగ్రత్త తీసుకోవాలని ప్రముఖ వైద్యులు డిడి నాయుడు సూచించారు. ప్రపంచ కిడ్నీడే సందర్బంగా ఇక్కడి నర్సింగరావుపేట వెంకటేశ్వర ఆసుపత్రిలో గురువారం అక్కడకు వచ్చిన రోగులకు కిడ్నీ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ళుదాటిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కిడ్నీటెస్టులు చేయించుకోవాలన్నారు.రక్తపోటుతో బాధ పడుతున్నవారికి మూత్ర పిండాలపై ప్రభావం చూపుతుందన్నారు.ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహరం నాణ్యతాలోపం ఉండడం వలన ఎక్కువ శాతం కిడ్నీ వ్యాధులు రావడానికి ఆవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పడు పరీక్షలు చేయించుకొని ఆహర నియమాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ డిడి నాయుడు తెలిపారు.