విశాఖ

సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను తప్పించిన టీడీపీ అధిష్టానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల , మార్చి 14: పాయకరా పేట సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనితపై అసమ్మతితో పాటు చంద్రబాబు వద్ద ఉన్న సర్వేల ఆధారంగా ఇక్కడి నుంచి తప్పించి కొవ్వూరుకు బదిలీ చేసారు. అనిత స్థానంలో విశాఖ కేజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ బంగారయ్యకు టిక్కెట్‌ను కేటాయించారు. ఈమేరకు బంగారయ్యకు టిక్కెట్‌ను కేటాయించామని ఆయన అభిప్రాయాలు చెప్పాల్సిందిగా గురువారం ఆవి ఆర్‌వీ సర్వే నిర్వహించారు. చివరి వరకు బంగారయ్యకు చెంగల కుమార్తె విజయలక్ష్మి పోటీ ఇచ్చారు. విజయలక్ష్మి పోటీలో ఉంటే మళ్ళీ వర్గాలు తలెత్తుతాయని భావించిన అధిష్టాన వర్గం బంగారయ్య వైపే మొగ్గుచూపింది. ఆడారి తులసీరావు వర్గం విజయలక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. చెంగల నియోజకవర్గంలోని క్యాడర్ వలన గెలుపు సునాయాసం అవుతుందని తులసీరావు వర్గీయులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. వైసీపీ గొల్లబాబూరావుకు, జనసేన నక్కా రాజుబాబుకు టిక్కెట్ కేటాయించడంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టీడీపీకి కంచుకోట అయిన పాయకరావుపేట నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే టీడీపీ తరుపున పోటీ చేసి చెంగల వెంకట్రావుపై సుమారు 2,800 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జనసేన అభ్యర్థి రంగంలో ఉండడంతో ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందోనని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు లోలోన ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ దాఖలు ముగిసిన తరువాత నియోజకవర్గంపై స్పష్టత రానున్నది.

జిల్లా స్థాయి మేళాలో
తంగేడు విద్యార్థికి ద్వితీయ బహుమతి
కోటవురట్ల, మార్చి 14: జిల్లా స్థాయిలో నిర్వహించిన గణితం, సైన్స్ మేళాలో కోటవురట్ల మండలం తంగేడు ఎంపీయుపీ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్న వీవీ దుర్గా ప్రసాద్‌కు గణితంలో ప్రదర్శించిన ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈమేళాలో జిల్లాకు చెందిన 200 ఎంపీయుపీ స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కోటవురట్ల, మార్చి 14: ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నర్సీపట్నం రూరల్ సీ ఐ రేవతమ్మ విజ్ఞప్తి చేసారు. గురువారం మండలంలో రాజుపేటలో గ్రామస్తులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీ ఐ రేవతమ్మ మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఓటర్లు భయాందోళన చెందాల్సిన పని లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణా జరుగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మధుసూధనరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వేగి ఈశ్వర రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

పేట జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నక్కా రాజుబాబు
పాయకరావుపేట, మార్చి 14: జనసేన పార్టీ ఇప్పటికే సీట్లు ప్రకటించినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాయకరావుపేట నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నక్కా రాజుబాబుకు టిక్కెట్ కేటాయించడంతో జనసైనికుల్లో ఆనందాలు వెల్లివిరిసాయి. గురువారం పార్టీ కార్యాలయంలో జనసేన అనకాపల్లి పార్లమెంటరీ సెక్రటరీ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదేళ్ళు అయిన సందర్భంగా నియోజకవర్గంలోని జనసైనికులు భారీ సంఖ్యలో రాజమండ్రిలో జరిగే సభకు తరలివెళ్ళారు. ఈసందర్భంగా బుజ్జి మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సును కోరుకునే తామంతా పార్టీకి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. జరుగబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజుబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అనంతరం రాజుబాబు మాట్లాడుతూ బుజ్జి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తామన్నారు. అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జనసైనికులతో రాజమండ్రి సభకు తరలివెళ్ళారు. కార్యక్రమంలో బి.శివదత్త, ఎన్. పద్మావతి, ఎన్.గోపీ, జక్కన్నదొర, పి.దుర్గారావు, ఎం.శ్రావణి, కార్యకర్తలు పాల్గొన్నారు.