విశాఖ

పార్టీ మారే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల. మార్చి 14: కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ మంత్రి మత్యరాస మణికుమారి స్పష్టం చేసారు. గురువారం ఆంధ్రభూమి తో ఆమె పోన్ లో మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీ లోకి మారుతున్నాట్టు తనపై వస్తున్న తప్పుడుప్రచారంను ఖండిస్తున్నానని తెలిపారు. పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని, తనకు పార్టీ టికెట్ ఆశించే హక్కు ఉందని,సుదీర్గ కాలంగా పార్టీ సేవ చేస్తు పార్టీ నియమాలకు అనుగుణంగా నడుచుకుంటు ఉన్నానని ఈ సమయంలో టికెట్ వస్తుందని ఆశించడంలో తప్పులేదని తెలిపారు. పార్టీలో సీనియర్ నాయుకురాలుగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసానని ఆమె అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేసే వరకు ఎవరు పోటీలో ఉంటారో తెలియదని, బీ.్ఫరం ఇచ్చిన తర్వాత కూడా నామినేషన్ వేయించకుండి బీ.పారం మార్చి వేరొక్కరికి ఇచ్చిన నియోజక వర్గాలు ఉన్నాయని అన్నారు. ఈ నెల 17 న పార్టీ అధినేత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసివరకు పాడేరు నియోజక వర్గంలో ఎవరికి కేటాయించారనేది తెలియదని చెప్పలేమని అన్నారు. టికెట్ విషయంలో నిశ్శబ్ధంగా ఉన్నానని పార్టీ మారిపోతున్నారని చెడుగా ప్రచారం చేయడం సరికాదని, రాజకీయ దురుద్ధేశ్శంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఇలాంటి ప్రచారం ఆపాలని, నేను పార్టీ మారే ఉద్ధేశ్యం లేదని అలాంటి ఉద్ధేశ్యం ఉంటే ఎప్పుడో మారి పోయి ఉండేదానినని, నాప్రాణం పోయేవరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. నేను వైసీపీ లో వెళ్తున్నట్టు ప్రచారం చేసి కార్యకర్తలకు అయోమయానికి గురిచేయడం సరికాదని మణికుమారి తెలిపారు.

ఉపాధి పనులు పరిశీలించిన ఎంపిడిఒ
జి.మాడుగుల.మార్చి 14: గ్రామీణ ఉపాధి హామి పథకం పనులు వేగవంతం చేస్తు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధి కూలీలకు స్థానిక ఎం.పి.డి.ఓ. ఆర్వీ రమేష్ అన్నారు. గురువారం మండలంలోని కోరాపల్లి పంచాయతీ పెద జాగేరు గ్రామంలో ఆయన పర్యటించి ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. పని దినాలు పూర్తి అయిన కూలీలకు అదనంగా మరో 50 పని దినాలు కల్పించాలని ఆయన సూచించారు. వేసవి కాలంతో పాటు రానున్నది ఎపడమిక్ సీజన్ కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి నీటి బావులకు క్లోరినేషన్ చేయించుకోవాలని ఎం.పి.డి.ఒ. రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోరాపల్లి పంచాయతీ కార్యదర్శి జి.వి.ఎస్.కుమార్, ఎఫ్.ఎ. చిట్టినాయుడు పాల్గొన్నారు.