విశాఖపట్నం

నగరంలో ప్రచార రథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: ఎన్నికల సందడి వచ్చేసింది...త్వరలో ప్రచారాలు ప్రారంభం కానున్నాయి...దీనికి తగినట్టుగా ప్రచార రథాలు ముస్తాబవుతున్నాయి. ప్రచార రథాలు పార్టీ జెండాలు పులుముకుంటున్నాయి. జెండాలు, రంగుల హంగులతో ఇవి తయారవుతున్నాయి. సరైన ముహుర్తం చూసుకుని వీటిని రోడ్డెక్కించాలని ఆయా పార్టీ నాయకులు చూస్తున్నారు. వీటికి లౌడ్ స్పీకర్లు తగిలిస్తున్నారు. ఇక పార్టీ ప్రచారాలకు అవసరమైన యువకుల కోసం వెదుకుతున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సాఆర్‌కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్, జనసేనలతోపాటు మరికొన్ని పార్టీలకు సంబంధించిన ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ మైకులు, జెండాలు అమరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ముఖ్యనేతలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఇవి రూపొందుకుంటున్నాయి. వీటిని ప్రత్యేకంగా తయారు చేసేందుకు అనుభవం కలిగి ఉండే వర్క్‌షాప్‌లకు ఇపు డిమాండ్ ఏర్పడింది. వన్‌టౌన్ సమీపానున్న రామకృష్ణా థియేటర్, పూర్ణామార్కెట్, మర్రిపాలెం, కంచరపాలెంమెట్టు, జ్ఞానాపురం, అల్లిపురం మార్కెట్ ఏరియా, కొబ్బరితోట, నగర శివారు ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ప్రచార రథాలను ముస్తాబుచేస్తుండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో పాత వాహనాలకు మరమ్మతులు చేసి మరీ రోడ్డెక్కించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రచారంలో తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను ప్రచార రథాల్లోనే ఏర్పాటు చేయాలని కూడా ఆయా పార్టీల నేతలు ఆలోచన చేస్తున్నారు. వాహనాల వెంట ఉండే వారిన్ని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వీలుగా ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు.