విశాఖ

ఎమ్మెల్యే బూడికి దేవరాపల్లిలో బ్రహ్మరధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, జూన్ 16: మాడుగుల నియోజక వర్గ శాసనసభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌గా ప్రమాణస్వీకారం చేసి తొలిసారిగా విశాఖకు తిరిగి వస్తున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ఆదివారం నియోజక వర్గ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా నియోజక వర్గం లోని నాలుగు మండలాల నుంచి ప్రజలు వేలాదిగా ఎయిర్‌పోర్టుకు తరలివెళ్లి ఎమ్మెల్యే బూడికి ఘనస్వాగతం పలికారు. ఆయన రాకకు జిల్లా ప్రజలు ఎదురుచూసి అపూర్వ స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి దేవరాపల్లి మండలం తారువ గ్రామం వరకు వందలాది వాహనాలతో అభిమానులు ఆయన వెంట తరలి వచ్చారు. దేవరాపల్లిలోని ఎంపిపి కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లి ఆయన స్వాగతం పలికి దేవరాపల్లి గ్రామానికి బ్యాండు మేళంతో ర్యాలీగా వచ్చి భారీ ఊరేగింపు చేసారు. ముందు దేవరాపల్లి నాల్గురోడ్లు జంక్షన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, రామాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, కిలపర్తి యూత్ హారతులు ఇచ్చి శాలులతో సన్మానాలు చేసారు. దేవరాపల్లి అంతా పండగ వాతావరణంగా మారింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కర్రి సత్యం, యూత్ అధ్యక్షుడు బూరె బాబురావు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, లలితానాయుడు, డాక్టర్ సింహాచలంనాయుడు, చల్లా తాతయ్యలు, అవుగడ్డ రామ్మూర్తినాయుడు, చలుమూరు చంద్రమోహన్, దాడి జగన్, మాజీ సర్పంచ్ పోతల లక్ష్మి, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ నాయుకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
బూడి రాకతో కురిసిన వర్షం : దేవరాపల్లి గ్రామానికి ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు రాకతో వర్షం కురిసిందని నాయుకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరిసింది. ఆయన దేవరాపల్లి రావడంతో వర్షంతో తడుచుకుని ప్రజలకు అభివాదం చేస్తూ తారువ గ్రామానికి చేరుకున్నారు.

ప్రభుత్వ విప్ బూడికి
వైసీపీ నేతల ఘన స్వాగతం
పరవాడ, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులై ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా విశాఖపట్నం విచ్చేసిన మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ఆదివారం విశాఖపట్నం విమానాశ్రయంలో వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రభుత్వం విప్ నియమితులైన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసి ముత్యాలనాయుడు తొలిసారి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం చేరుకున్న ముత్యాలనాయుడుకు పెందుర్తి వైకాపా నేతలు పయిల శ్రీనివాసరావు, బైయిలపూడి భగవాన్ జయిరామ్, అన్నంరెడ్డి అజయ్‌రాజ్, చుక్క రామునాయుడు, మద్ది శ్రీనివాసరావు, సబ్బవరపు నారాయణమూర్తి, ముమ్మన దేముడులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

ప్రభుత్వ విప్ ‘బూడి’కి ఘన స్వాగతం
మాడుగుల, జూన్ 16: ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఘాట్ రోడ్డు జంక్షన్ నుంచి ర్యాలీగా వెళ్లడంతో సందడి వాతావరణం నెలకొంది. మాడుగుల నియోజకవర్గం నుంచి రెండో సారి శాసనసభ్యుడిగా విజయం సాధించడమే కాకుండా పార్టీ అధిష్టానానికి విధేయుడిగా బూడి ఉండడంతో ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు విశాఖ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.