విశాఖ

ప్రసాదాల కొరత నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 21: చారిత్రక ప్రధాన్యత గల సింహాచలం పుణ్యక్షేత్రంలో సమస్యాత్మకంగా మారిన ప్రసాదాల కొరతను నివారించేందుకు ఈవో వెంకటేశ్వరరావు చర్యలు చేపట్టారు. లడ్డూ, పులిహోరా ప్రసాదాలను భక్తుల డిమాండ్ మేరకు అందించడంలో దేవస్థానం విఫలమవుతూ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఈవో వెంకటేశ్వరరావు గురువారం దేవాలయ సహాయ కార్యనిర్వాహణాధికారి పులి రామారావు, కార్యనిర్వాహక ఇంజినీర్ బీ.మల్లీశ్వరరావు, ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్, వంటశాల ఖరోడా, కైంకర్య పరులతో పాటు లడ్డూ తయారు చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని సమావేశ పరిచి సుదీర్ఘంగా చర్చించారు. ఎంతో దూరం నుండి ఎన్నో వ్యయప్రయాసలకోడ్చి వచ్చే భక్తులకు ప్రసాదాలు అందించలేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ప్రసాదాలు అందడంలేదని తనతో భక్తులు చెప్పిన కొన్ని సంఘటనలను ఈవో సిబ్బంది ముందుంచారు. ప్రసాదాల కొరతకు కారణాలను అడిగితెలుసుకున్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది సరిగ్గా విధులకు రావడంలేదని అధికారులు సమాధానం చెప్పారు. వంటశాల అనువుగా లేదని వేడి బయటకు పోవడానికి సరైన మార్గాలు లేక సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని వంటస్వాములు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. అదనంగా 20 మంది వంటస్వాములను నియమించుకొని వారి జీతాల బాధ్యత దేవస్థానం తీసుకొని, షిప్టు పద్దతిలో విధులను కేటాయించుకోవాలని వంటస్వాములు, స్థానాచార్యులు ఈవోకి సూచించారు. వైదికుల సూచనల మేరకు వంటస్వాముల నియమానికి ప్రకటన వేద్దామని నిర్ణయం తీసుకున్నారు. పులిహోర ప్రసాదం తయారీలో భాగంగా రెండు బాయిలర్లను ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే అదనపు వంటస్వాములను నియమించుకొని ప్రసాదాల కొరతకు పరిష్కారం చూపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయత్నం విఫలమైతే ప్రసాదాల అంశం పై ప్రత్యమ్నాయ ఏర్పాట్ల అంశాన్ని కూడా ఈవో వైదికులముందుంచారు. దేవాలయ సంప్రదాయాలను కాపాడడానికి అందరూ సహకరించాలని పరోక్షంగా వైదికులకు సూచన చేసారు.