విశాఖ

ఆయోధ్యలో రామాలయానికి రాష్ట్ర సహకారం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 21: అయోధ్యలో చారిత్రాత్మక రామాలయం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున సహకారం అందించే యోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని అనకాపల్లి శాసన సభ్యుడు గుడివాడ అమర్‌నాధ్ అన్నారు. గురువారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. ముస్లీములకు మక్కా వెళ్లడానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్న తరహాలోనే హిందువులు పవిత్రంగా భావించే మానస సరోవరం గాని కాశీ యాత్రకు గాని సహకారం అందించాలని వస్తున్న విజ్ఞాపనల మేరకు విలేఖరులడిగిన ప్రశ్నల పై ఆయన స్పందించారు. తిరుమల వేంకటేశ్వరుడిని కూడా హిందులు అత్యంత పవిత్రంగా భావిస్తారని చెప్పిన ఆయన అన్ని మతాలను, అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు. ప్రజలంతా సుఖ శాంతులతో జీవనం సాగించాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. సింహాలేశుడు తమ ఇంటి ఇలవేల్పని తాత, తండ్రుల నుండి స్వామివారి దర్శనం చేసుకొనే ఏ కార్యమైనా తలపెడతామని అన్నారు. శనివారం అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉందని ఈ నేపధ్యంలోనే స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని అమర్‌నాధ్ వెల్లడించారు. ఈయనతో పాటు వైసీపీ నాయకులు కొలుసు ఈశ్వరరావు, శ్రీనివాసవర్మ, రామరాజు, అప్పలరాజు, ఎర్ర వరంబాబు, వరదా నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.