విశాఖపట్నం

ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన స్వరూపనందేంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మందిరాన్ని గురువారం విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సందర్శించారు. తొలుత స్వామజీ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర సరస్వతీ అనుగ్రహం భాషణం చేశారు. కార్తీక మాసానికి విశాఖకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. కార్తీకమాసం వచ్చిందంటే విశాఖ ప్రజలంతా కూడా ఆథ్యాత్మిక భక్తి మార్గంలో ముందుకు సాగుతారని స్వామీజీ కొనియాడారు. రాజయోగానికి మించింది ప్రపంచంలోనే లేదని తద్వారా ప్రతిఒక్కరూ కూడా ఈశ్వరీయ పరమాత్మను అనుసరించి ఆ మార్గంలో సాగాలని స్వామీజీ ఆకాంక్ష వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్రను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బీజే రామేశ్వరి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సత్యవతి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.