విశాఖపట్నం

జాలర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 21: జాలర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని తీర ప్రాంత వాడబలిజ సంక్షేమ సంఘం ప్రతినిధి మూగి శ్రీరామమూర్తి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సమీపానున్న తీర ప్రాంత వాడబలిజ (మత్స్యకార) సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడలుతూ అన్నివర్గాల్లో వెనకబడి ఉన్న మత్స్యకారులను ఎస్సీ జాబితాల్లో చేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అయితే నేడు మత్స్యకారులకు పెద్దపీట వేస్తోన్న వైసీపీ ప్రభుత్వం తామందరికీ ఎస్టీలో చేర్చి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. స్వాతంత్రం సిద్ధించి 72 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా మత్స్యకారులు వెనుకబడి ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో ఆందోళనలు చేసామని, ప్రతిపక్షంలో ఉండే వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మోపీదేవి వెంకటరమణ తదితరులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా మద్దతునిచ్చారన్నారు. నేడు అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించిన వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం హర్షనీయమన్నారు. ఇప్పటికైనా మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చకపోతే మళ్ళీ ఉద్యమిస్తామని హెచ్చరించారు. * సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర చైర్మన్ అల్లిపిల్లి యల్లాజీ డిమాండ్ చేశారు. రెండురోజులపాటు నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సీపెరల్ క్యాంటిన్ వద్ద ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ పెద్దలతో పేద మహిళలకు చీరలు, పంపిణీ,్భజనాలు నిర్వహిస్తున్నామన్నారు.