విశాఖపట్నం

నేటి నుంచి కుటుంబానికి అరకిలో ఉల్లిపాయాలే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: గత రెండు నెలలుగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకూ రైతు బజార్లలో కిలో ఉల్లిపాయాలు సబ్సీడీ ధరకే అందించే మార్కెటింగ్ శాఖ అధికారులు, ఆశించిన స్థాయిలో ఉల్లి లభించకపోవడంతో నేటి నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో అరకిలోనే ఒక కుటంబానికి అందించాలంటూ ఆయా రైతు బజార్ల ఏస్టేట్ ఆఫీసర్లుకు ఆదేశాలు అందాయి. నగరంలోని 13 రైతు బజార్లు ఉండగా వీటిలో అధికంగా సీతమ్మధార, ఎంవీపీకాలనీ, నరసింహనగర్, గోపాలపట్నం,పెదవాల్తేరు రైతు బజార్లుకు అధిక స్థాయిలో డిమాండ్ ఉంటుంది. కొద్ది రోజుల కిందట వరకూ రూ.30 నుంచి 40 మధ్య లభించే ఉల్లి ధర ఒక్కసారిగా రూ.70కి చేరిపోయింది. వాతావరణ పరిస్థితులు, పంట దిగుబడి తగ్గుదల వంటి అంశాలకు తోడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కావాల్సిన ఉల్లి పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అత్యధికంగా నగరంలోని హోల్‌సేల్ వ్యాపారస్తులు మాత్రం మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా నగర అవసరాలకు రోజుకు 100 నుంచి 120 టన్నుల ఉల్లి దిగుమతి అవుతుంది. దీనిలో 80 శాతం మహారాష్ట్ర నుంచి వస్తుంది. గత కొద్ది రోజులుగా దిగుమతి తగ్గిపోవడంతో ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.70 వరకూ ధర పలుకుతోంది. అయితే నగరంలోని 13 రైతు బజార్లలో మనిషికి రెండు కిలోల చొప్పున రాయితీపై కిలో రూ.25కి అమ్మకాలు చేసినప్పటికీ శుక్రవారం నుంచి అరకిలోనే అందించనున్నారు. ఈ ఉల్లిపాయాలూ కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు కర్నూలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.